Homeబిజినెస్Apple Foldable iPhone: బిగ్ బ్రేకింగ్.. కోటి ఐ ఫోన్లకు ఆర్డర్.. ఈ ఫోన్ కు...

Apple Foldable iPhone: బిగ్ బ్రేకింగ్.. కోటి ఐ ఫోన్లకు ఆర్డర్.. ఈ ఫోన్ కు ఎందుకంత డిమాండ్..

Apple Foldable iPhone: యాపిల్ ప్రేమికులకు ఇది నిజంగానే ఒక అద్భుతమైన వార్త. టెక్ దిగ్గజం యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ (Foldable iPhone) ను మార్కెట్లోకి తీసుకురావడానికి సర్వసిద్ధం అవుతోంది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ మార్కెట్‌లో శాంసంగ్, వన్‌ప్లస్, గూగుల్ వంటి సంస్థలు ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలో దూసుకుపోతుండగా.. ఇప్పుడు యాపిల్ కూడా ఆ రేసులోకి అధికారికంగా అడుగుపెట్టబోతోంది. ఈ మేరకు కంపెనీ తన సప్లయర్లకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు మార్కెట్ వర్గాల సమాచారం. అదేంటంటే… ఇప్పటి వరకు ఈ ఫోల్డబుల్ ఫోన్లు కోటి వరకు ఆర్డర్ వచ్చాయి.. ఈ వివరాల్లోకి వెళితె..

యాపిల్ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఈ ఏడాదే మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు ముమ్మరం చేస్తున్నట్లు తాజా సమాచారం. మొదటి ఫోల్డబుల్ మోడల్‌ను ‘iPhone Fold’ లేదా ‘iPhone Ultra’ పేరుతో విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాల సమాచారం. అయితే తన మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ కోసం యాపిల్ పెద్ద ఎత్తున తయారీ లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొదటి దశలోనే ఏకంగా 1 కోటి (10 మిలియన్) ఫోల్డబుల్ ఫోన్లను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని యాపిల్ తన సప్లై చైన్ భాగస్వాములకు సూచించినట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఏ కంపెనీ అయినా తమ సరికొత్త డిజైన్ ఫోన్లను తక్కువ సంఖ్యలో ప్రయోగాత్మకంగా విడుదల చేస్తుంది. కానీ యాపిల్ మాత్రం మొదటి ప్రయత్నంలోనే భారీ స్థాయిలో మార్కెట్‌ను ఆక్రమించాలని చూస్తోంది.ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో ఇది అత్యంత కీలక అడుగుగా భావిస్తున్నారు, ఎందుకంటే యాపిల్ ఇప్పటివరకు ఈ రకమైన డిజైన్‌లో ఫోన్‌ను విడుదల చేయలేదు. అందుకే, డిమాండ్, ప్రీమియం ధర, సరఫరా సామర్థ్యం అన్నీ కలిసి ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలను పెంచుతున్నాయి.

ఫోల్డబుల్ ఐఫోన్‌తో పాటు యాపిల్ తన అప్‌కమింగ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన iPhone 18 పై కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. కంపెనీ సుమారు 7 కోట్ల (70 మిలియన్) యూనిట్ల ఐఫోన్ 18 ప్రో , ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని బట్టి ప్రీమియం, అల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను పూర్తిగా శాసించాలని యాపిల్ వ్యూహాలు రచిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

యాపిల్ ఉత్పత్తులు ఎప్పుడూ ప్రీమియం ధరలోనే ఉంటాయి, ఇక ఫోల్డబుల్ ఫోన్ అంటే ఆ ధర మరింత ఆకాశాన్ని తాకడం ఖాయం. ఈ సరికొత్త ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా ధర సుమారు 2,500 డాలర్లు ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 2.38 లక్షల వరకు ఉంటుంది. టాక్స్ లు, ఇతర సుంకాలు కలిపితే భారత్‌లో దీని ధర ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version