Kidney: అది కిడ్నీ నా..? రాళ్ల గుట్టనా..? ఏకంగా మూడు వేల రాళ్లు తీసిన వైద్యులు

‘Kidney: మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయి. అందుకే మీరు కొంత ఇబ్బంది పడుతున్నారు’ సాధారణంగా కిడ్నీ సంబంధిత సమస్యతో నెఫ్రాలజీ వైద్యుల వద్దకు వచ్చే రోగులకు అటు నుంచి వచ్చే సమాధానం ఇలా ఉంటుంది. సాధారణంగా మనిషికి కిడ్నీలో ఒకటి, రెండు నుంచి డజన్ వరకు రాళ్లు ఉండటం చూస్తుంటాం. కానీ, ఓ వృద్ధుడి కిడ్నీల్లో ఏకంగా మూడు వేలకు పైగా రాళ్లు ఉండటం చూసిన వైద్యులు అవాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కిడ్నీలు లెక్కేంటో ఒకసారి […]

Written By: NARESH, Updated On : March 10, 2023 11:31 am
Follow us on

‘Kidney: మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయి. అందుకే మీరు కొంత ఇబ్బంది పడుతున్నారు’ సాధారణంగా కిడ్నీ సంబంధిత సమస్యతో నెఫ్రాలజీ వైద్యుల వద్దకు వచ్చే రోగులకు అటు నుంచి వచ్చే సమాధానం ఇలా ఉంటుంది. సాధారణంగా మనిషికి కిడ్నీలో ఒకటి, రెండు నుంచి డజన్ వరకు రాళ్లు ఉండటం చూస్తుంటాం. కానీ, ఓ వృద్ధుడి కిడ్నీల్లో ఏకంగా మూడు వేలకు పైగా రాళ్లు ఉండటం చూసిన వైద్యులు అవాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కిడ్నీలు లెక్కేంటో ఒకసారి చూసేద్దాం.

పిడికిడంత పరిమాణంలో ఉండే కిడ్నీలు మనిషి శరీరంలో అత్యంత కీలకమైనవి. నిరంతరం మలినాలను వడపోసి శరీరం విషతుల్యం కాకుండా కాపాడడంలో కిడ్నీలది కీలకపాత్ర. అయితే, అటువంటి కిడ్నీల్లో మన ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు వల్ల రాళ్లు చేరుతుంటాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నాయంటూ వైద్యుల వద్దకు వెళుతుండడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సాధారణంగా ఒక వ్యక్తికి ఉన్న రెండు కిడ్నీలో ఏ కిడ్నీలో అయినా రాళ్లు చిన్న పరిమాణంలో ఉంటే మందుల ద్వారా కరిగిస్తారు. 30 ఎంఎం పరిమాణం కన్నా ఎక్కువ ఉంటే కీ హోల్ లాప్రోస్కోపీ విధానంలో సర్జరీ చేసి ఆ రాళ్ళను బయటకు తీస్తారు. సాధారణంగా ఒక్కో కిడ్నీలో రెండు నుంచి ఆరు రాళ్ల వరకు ఉండటం సహజమని వైద్యులు చెబుతున్నారు. అతి కొద్దిమందిలో మాత్రమే పది, అంతకంటే ఎక్కువ రాళ్ళు ఉంటాయి. కానీ, చిత్తూరు జిల్లాలోని ఓ వృద్ధుడి కిడ్నీలో ఉన్న రాళ్లను చూసిన వైద్యులు షాక్ కు గురయ్యారు. భారీగా బయటపడిన రాళ్ల గుట్టను చూసిన వైద్యులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది.

నడుము నొప్పితో వస్తే.. గుట్టలుగా రాళ్లు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మండలానికి చెందిన ఓ వృద్ధుడు విపరీతమైన నడుము నొప్పితో బాధపడుతున్నాడు. భరించలేని నొప్పితో మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన వృద్ధుడికి ఆల్ట్రా సౌండ్ పరీక్ష నిర్వహించిన వైద్యులు అందులో కనిపించిన రాళ్లను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తాము చూసినది నిజమో కాదో అన్న విషయాన్ని ఒకటికి రెండుసార్లు వైద్యులు నిర్ధారించుకొని షాక్ తిన్నారు. దాదాపు 100కు పైగా కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వెంటనే వాటిని తొలగించుకావాలని, లేకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని వైద్యులు ఆ వృద్ధుడు కుటుంబ సభ్యులకు తెలిపారు.

గుట్టల కొద్దీ బయటపడిన రాళ్లు..

వైద్యుల సూచన మేరకు వెంటనే కుటుంబ సభ్యులు అంగీకరించడంతో కిడ్నీలో కుప్పలుగా పేరుకుపోయిన రాళ్ళను తొలగించేందుకు వైద్యులు అధునాతన కీ హోల్ లాప్రోస్కోపీ పద్ధతిలో సర్జరీని ప్రారంభించారు. అల్ట్రా సౌండ్ పరీక్షలను నిర్వహించినప్పుడు గుట్టలుగా కనిపించిన రాళ్లు 100కు పైగా ఉంటాయని భావించిన వైద్యులకు శస్త్ర చికిత్స ప్రారంభించి రాళ్లను తొలగిస్తే గాని అసలు విషయం బోధపడలేదు. బావిలో నీళ్ల ను తోడేకొద్ది వచ్చినట్లుగా వృద్ధుని కిడ్నీ నుంచి లెక్క కు మించిన సంఖ్యలో రాళ్లను వైద్యులు బయటకు తీశారు. గంటలు తరబడి శస్త్ర చికిత్స నిర్వహించి దాదాపు మూడు వేల రాళ్లను వృద్ధుడి కిడ్నీ నుంచి వైద్యులు బయటకు తీశారు. భారీగా బయటకు తీసిన రాళ్ళను చూసిన వైద్యులతోపాటు వైద్య సిబ్బంది, రోగి కుటుంబ సభ్యులు షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రోగి కిడ్నీలో ఈ స్థాయిలో రాళ్ళు చేరడం అరుదు అని వైద్యులు తెలిపారు. ఆహారపు అలవాట్లు, సరిగా నీరు తాగకపోవడం, యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోవడం వంటి కారణాల వల్లే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్ తర్వాత వృద్ధుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రస్తుతం కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.

Tags