Pavan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో స్టార్ డైరెక్టర్స్ తో పనిచేసింది చాలా తక్కువ..దర్శక ధీరుడు రాజమౌళి, సుకుమార్ లాంటి దిగ్గజ దర్శకులు ఆయనతో సినిమాలు తియ్యడానికి పడిగాపులు గాస్తున్న కూడా ఆయన మాత్రం తన మూడ్ కి అనుగుణంగా ఉండే డైరెక్టర్స్ తో పనిచెయ్యడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తూ వచ్చాడు.కెరీర్ మొత్తం మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పూరి జగన్నాథ్ మినహా,ఒక్క స్టార్ డైరెక్టర్ తో కూడా ఇది వరకు ఆయన పని చెయ్యలేదు.ఈ క్రమం లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు.అయితే కొన్ని సినిమాలు ఒప్పుకొని ప్రారంభోత్సవం జరుపుకున్న తర్వాత ఆగిపోయినవి కూడా పవన్ కళ్యాణ్ వి చాలానే ఉన్నాయి.అవేంటో ఒకసారి చూద్దాము.
1 ) సత్యాగ్రహి :
జానీ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వం లో తెరకెక్కాల్సిన సినిమా ఇది.అల్లు అరవింద్ నిర్మాత, కానీ ఎందుకో కథ విషయం పూర్తిగా న్యాయం దొరకకపొయ్యేసరికి ఈ సినిమాని మధ్యలోనే ఆపేసాడు పవన్ కళ్యాణ్.ఈ చిత్రం షూటింగ్ సమయం లో తీసిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
2 ) చెప్పాలని ఉంది :
AM రత్నం నిర్మాతగా పవన్ కళ్యాణ్ అమీషా పటేల్ హీరో హీరోయిన్లు గా అప్పట్లో ‘చెప్పాలని ఉంది’ అనే సినిమా తీశారు.భారీ ఎత్తున్న అప్పట్లో ముహూర్తం కూడా జరుపుకొని ఫోటో షూట్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసారు.కానీ ఎందుకో ఈ సినిమా కూడా ఆగిపోయింది, ఆ తర్వాత అదే స్టోరీ తో రామోజీ రావు తరుణ్ మరియు రిచా లను హీరోహీరోయిన్స్ గా పెట్టి నువ్వే కావలి అనే సినిమా తీసాడు.ఈ చిత్రం ఆరోజుల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
3) ప్రిన్స్ ఆఫ్ పీస్:
పవన్ కళ్యాణ్ – సింగీతం శ్రీనివాస రావు కాంబినేషన్ లో ప్రారంభమైన సినిమా ఇది, ఇందులో పవన్ కళ్యాణ్ కేవలం అతిథి పాత్ర మాత్రమే, ఒక 20 నుండి 30 నిమిషాల నిడివి ఉంటుంది.అప్పట్లో అట్టహాసం గా ప్రారంభమైన ఈ సినిమా కూడా మద్యాలనే ఆగిపోయింది.
4 ) కోబలి :
రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ని సరికొత్త రీతిలో చూపించాలనుకున్న సినిమా ఇది.త్రివిక్రమ్ డ్రీం ప్రాజెక్ట్ , కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ కథకి న్యాయం చెయ్యగలడు అనే ఉద్దేశ్యం తో త్రివిక్రమ్ కి వేరే హీరో తో చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తో మాత్రమే తియ్యాలని కూర్చుకున్నాడు.భవిష్యత్తులో అయినా ఈ సినిమా ఉంటుందో లేదో తెలియదు కానీ , త్రివిక్రమ్ ఈసారి పవన్ కళ్యాణ్ తో సినిమా తియ్యాల్సి వస్తే ఈ స్టోరీ తోనే తీస్తాను అని గతం లో చెప్పుకొచ్చాడు.
5 ) దేశీ:
పవన్ కళ్యాణ్ కి దేశ భక్తి ఉన్న సినిమాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆ పాత్రలు పోషించడానికి కూడా ఆయనకీ ఎంతో ఆసక్తి, అలాంటి దేశభక్తి తో కూడిన ఈ సినిమాని ప్రారంభించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయినా తర్వాత ఆపేయాల్సి వచ్చిందట.