Shivaji: సినిమాల్లో హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ(ActorSivaji). అయితే మధ్య పదేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగి, కెరీర్ మీద పూర్తిగా పట్టు కోల్పోయాడు. ఇక రాజకీయాలు చాలు అనుకొని, మళ్లీ వెండితెర అరంగేట్రం చేయడానికి సిద్దమైన శివాజీ, ముందుగా ‘బిగ్ బాస్ 7’ ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గర అవ్వాలని అనుకున్నాడు. ఆ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన శివాజీ ఒక చరిత్ర సృష్టించాడు అనే చెప్పాలి. మాస్టర్ మైండ్ గా ఇలా కదరా ఒక కంటెస్టెంట్ గేమ్ ఆడే పద్దతి, కింగ్ ని ఆయనే నిర్ణయించాడు, టాప్ 5 లో తనతో పాటు ఉన్న శిష్యులను తీసుకొచ్చాడు, గేమ్ ని ఆద్యంతం రక్తి కట్టించి, ఆడియన్స్ చేత శివన్నా అని ప్రేమగా పిలిపించుకునేలా చేసాడు. ‘బిగ్ బాస్ 7’ తో ఆయన సాధించాలని అనుకున్నది సాధించేసాడు.
హౌస్ నుండి బయటకు రాగానే ఆయనకు అద్భుతమైన పాత్రలు దక్కాయి. ముందుగా 90’s అనే వెబ్ సిరీస్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం శివాజీ కి బాగా కలిసొచ్చింది. ఇక ఆ తర్వాత ‘కోర్టు’ చిత్రంలో మంగపతి పాత్ర పోషించి సెన్సేషన్ సృష్టించాడు. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటి కథ అయితే, రెండు శివాజీ నటన. ఈ చిత్రం తర్వాత ఆయనకు వరుసగా ఆఫర్లు క్యూలు కట్టాయి. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తున్న శివాజీ, మరో పక్క కథా బలం ఉన్న చిన్న సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఆ క్రమం లోనే ఆయన ‘దండోరా’ అనే చిత్రం చేసాడు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో శివాజీ చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు.
అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘సినిమాల్లో గొప్ప రాణిస్తున్నారు..రాజకీయాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మీ అభిమానులు కోరుకుంటున్నారు’ అని శివాజీ ని అడగ్గా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘ రాజకీయాలు మనకి సెట్ అవ్వవు అండీ. ఈ రాజకీయాల్లో ఉండాలంటే నిర్దాక్షణ్యంగా ఉండాలి, లేదంటే ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకోవాలి, అది మనవల్ల కాదు. కానీ నాకు ఏదైనా అన్యాయం అనిపిస్తే మాత్రం కచ్చితంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అమరావతి రైతుల కోసం 8 ఏళ్ళు పోరాటం చేసాను. మళ్లీ వాళ్లకు ఏదైనా అన్యాయం జరిగితే నా గళం కచ్చితంగా వినిపిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో.
రాజకీయాల్లో నెగ్గాలంటే నిర్దాక్షణ్యంగా ఉండాలి… లేదంటే కాళ్ళు పట్టుకోవాలి.. నాకు రెండూ చేతకావు.. pic.twitter.com/OKDSIdbIo1
— Telugu360 (@Telugu360) December 18, 2025