Elon Musk : ఎలన్ మస్క్ కు భారీ ఎదురుదెబ్బ, అమెరికా మార్కెట్ కు భారీ షాక్, ట్రిలియన్ డాలర్ల విలువైన సంపద హరీ.. వరల్డ్ మార్కెట్ల పతనానికి కారణం ఏంటి?

టెస్లా షేర్ల ప్రభావం ఎలాన్ మస్క్ నికర విలువపై కూడా కనిపించింది. ఒక్క దెబ్బలో, అతని ఆస్తుల నుంచి 21.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.81 లక్షల కోట్లు) క్లియర్ అయ్యాయి. అయితే, ఈ నికర విలువలో ఈ తగ్గుదల ఉన్నప్పటికీ, ఎలాన్ మస్క్ నెం. 1 సంపన్నుల కుర్చీలోనే ఉన్నాడు. ఆయన మొత్తం సంపద 241 బిలియన్ డాలర్లుగా ఉంది.

Written By: NARESH, Updated On : July 25, 2024 6:31 pm
Follow us on

Elon Musk  :  ఎలన్ మస్క్ కు వరుస షాక్ తగులుతోంది. గత రెండు మూడు రోజులుగా ఆయన కంపెనీ (టెస్లా) షేర్లు పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంత గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఇది కొంత కాలం ఉంటుందని ఆయనే స్వయంగా చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ ఇదే ఒడిదొడుకులను ఎదుర్కొంటోందని, అమెరికా ఎన్నికలు ముగిసిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు రావచ్చని అనుకుంటున్నారు. భారత స్టాక్ మార్కెట్ రెండు రోజులుగా వరుస క్షీణతను చవిచూస్తోంది. ఇది ఈ రోజు కూడా కొనసాగింది. ఇది ఒక్క భారత మార్కెటే కాదు.. వరల్డ్ వైడ్ గా కొనసాగుతోంది. నిజానికి అమెరికా స్టాక్ మార్కెట్ లో అలజడి చెలరేగుతోంది. ఎస్ అండ్ పీ నుంచి గిఫ్ట్ నిఫ్టీ వరకు పరిస్థితి దారుణంగా ఉండడంతో అవి నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదిలాఉండగా, ప్రపంచంలోని అగ్రశ్రేణి సంపన్నుల సంపదలో భారీ క్షీణత సంభవించగా, ఎలాన్ మస్క్ కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మొదట, గ్లోబల్ మార్కెట్ లో గందరగోళం గురించి చెప్పుకుంటే.. గిఫ్ట్ నిఫ్టీ 0.38 శాతం క్షీణతతో 24,160 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు ఎస్ అండ్ పీ, నాస్డాక్ సూచీలు 2022 తర్వాత అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. గురువారం (జూలై 25) భారీ అమ్మకాల కారణంగా ఎస్ అండ్ పీ 500 2.31 శాతం, నాస్డాక్ 3.64 శాతం భారీ క్షీణతను చవిచూశాయి. డౌజోన్స్ లో 1.25 శాతం క్షీణించింది. ఈ బడా కంపెనీల షేర్లలో సునామీ అమెరికా మార్కెట్ లో ఈ అలజడికి కారణం అని తెలుస్తోంది. ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీల షేర్లు పతనమవడమేనని చెప్పవచ్చు. వీటిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ముందు వరుసలో ఉంది. టెస్లా షేరు ధర 12.3 శాతం క్షీణించి 215.99 డాలర్లకు పడిపోయింది.

టెస్లా షేర్లలో ఈ భారీ పతనం
ప్రభావం ఎలాన్ మస్క్ నికర విలువపై కూడా కనిపించింది. ఒక్క దెబ్బలో, అతని ఆస్తుల నుంచి 21.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.81 లక్షల కోట్లు) క్లియర్ అయ్యాయి. అయితే, ఈ నికర విలువలో ఈ తగ్గుదల ఉన్నప్పటికీ, ఎలాన్ మస్క్ నెం. 1 సంపన్నుల కుర్చీలోనే ఉన్నాడు. ఆయన మొత్తం సంపద 241 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఎలన్ మస్క్ మాత్రమే..
ఎలన్ మస్క్ మాత్రమే కాకుండా జెఫ్ బెజోస్ నుంచి బోరెన్ వాఫె వరకు గూగుల్ నుంచి మెటా వరకు షేర్లు పడిపోయాయి. టెస్లాతో పాటు, క్షీణతను చూసిన ప్రధాన స్టాక్స్ లో ఎన్‌విడియా కూడా ఉంది. ఇది 6.80 శాతం క్షీణించి 114.25 డాలర్లకు చేరుకుంది. మెటా ప్లాట్ ఫామ్ షేర్లు 5.61 శాతం క్షీణించి 461.27 డాలర్లకు పడిపోయాయి. అంతే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ షేర్లు 5 శాతం క్షీణించి 174.37 డాలర్లకు పడిపోయాయి.

భారత మార్కెట్ పై ప్రభావం..!
జపాన్ కు చెందిన నిక్కీ 225 2.72 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 1.77 శాతం, ఆస్ట్రేలియాకు చెందిన ఎస్ అండ్ పీ/ఏఎస్ ఎక్స్ 200 0.94 శాతం, హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ 0.39 శాతం నష్టపోయాయి. ఈ గందరగోళం మధ్య సుమారు ట్రిలియన్ డాలర్ల సంపద ఆహుతి అయినట్లు ప్రపంచ మార్కెట్ లో ఏదైనా కదలిక ప్రభావం భారత్ పై కూడా కనిపిస్తుంది. రెండు రోజులుగా కుదేలవుతున్న భారత స్టాక్ మార్కెట్ ఇంకా మందకొడిగా కొనసాగుతోంది.