ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక కప్పు చాయ్ తాగనిదే రోజు గడవదు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఒక కప్పుతో రోజును ప్రారంభిస్తాము. ఇలా ప్రతిరోజు టీ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అధిక ఒత్తిడి సమస్య నుంచి టీ ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా టీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది పదే పదే టీ తాగటం వల్ల ఇది అనారోగ్యాలకు కారణమవుతుంది.అయితే టీ తాగటం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
అందుకోసమే టీ తాగటం వల్ల గుండెకు రక్త ప్రసరణ సరిగా జరిగి గుండెకు కలిగే ప్రమాదాలను తగ్గిస్తూ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ప్రస్తుతం ఎన్నో రకాల టీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ టీ తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అలాగే బ్లాక్ టీ తాగడం వల్ల రక్తంలో పేరుకుపోయిన ప్రమాదకరమైన కొవ్వు కణాలను తొలగించడానికి ఎంతో దోహదపడుతుంది. మొత్తానికి టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమే కానీ రోజులో రెండు లేదా మూడుసార్లు తాగినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.