దేశంలోనే తమిళనాడు రాజకీయాలు చాలా ప్రత్యేకం.. మాతృభూమి.. మాతృభాషను ఎంతగానో గౌరవించే తమిళనాడు ప్రజలు రాజకీయాల్లోనూ మాతృ పార్టీలు.. అంటే లోకల్ రాజకీయ పార్టీలకే మద్దతు ఇస్తుంటారు. ఇప్పటి వరకు ఇక్కడ జాతీయపార్టీలు పీఠం అధిరోహించిన ఎన్నికలు చరిత్రలోనే లేవు. ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా.. పోటీలో గెలిచేది తమిళనాడు పార్టీలే.. పాలించేది లోకల్ నాయకులే.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే జాతీయస్థాయిలో ఊపుమీద ఉన్న బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీలు ఎన్నిలక ముందే వెనుకబడుతున్నాయి. నామినేషన్ వేసేందుకు కూడా అభ్యర్థలు దొరకని పరిస్థితి.
Also Read: జనసేనకు మద్దతుగా ‘చిరు’ ఉక్కు వ్యూహం?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము సొంతంగా నామినేషన్లు వేయగలిగిన నియోజకవర్గాల విషయంలోనూ జాతీయ పార్టీలు పూర్తిగా వెనకబడ్డాయి. ద్రవిడ పార్టీలు ముష్టిగా ఎన్ని సీట్లు వేస్తే.. అన్నింట పోటీ చేయడమే ఈ జాతీయ పార్టీలకు ప్రస్తుతం గగనమైంది. ఈ నేపథ్యంలో సీట్లబేరం అంటూ.. బోలెడంత చర్చల తరువాత కాంగ్రెస్ బీజేపీలు అక్కడ పోటీచేసే సీట్లపై క్లారిటీ వచ్చింది. డీఎంకే దయమీద కాంగ్రెస్.. అన్నా డీఎంకే దయమీద బీజేపీ తాము పోటీచేసే సీట్ల విషయంలో క్లారిటీ తెచ్చుకుంటున్నాయి. విశేషం ఎంటంటే.. బీజేపీ కన్నా.. కాంగ్రెస్సే.. ఇప్పుడు కాస్త బెటర్.
కాంగ్రెస్ పార్టీ 25 సీట్లు పోటీ చేస్తోంది. అన్నాడీఎంకేతో బోలెడంత చర్చల తరువాత 20 స్థానాల్లో బీజేపీ నామినేషన్లు వేయగలిగేలా ఉంది. ఇలా రెండు జాతీయపార్టీలు అత్యంత పరిమిత స్థాయి సీట్లకు పోటీ చేస్తున్నాయి. డీఎంకే.. అన్నా డీఎంకేల ఓటు బ్యాంకు వీటికి ఏమైనా కలిసి వస్తే.. గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. ఒక అన్నా డీఎంకే 177 సీట్లో పోటీ చేస్తుండగా.. డీఎంకే 173 సీట్లకు తమ అభ్యర్థులను ఖరారు చేసుకునే పనిలో ఉంది.
Also Read: మమతాపై దాడి.. వేడెక్కిన బెంగాల్ రాజకీయం
అన్నా డీఎంకే గతంలో కొన్నిసార్లు సొంతంగా ఎన్నికలకు వెళ్లి నెగ్గుకువచ్చిన చరిత్ర ఉంది. డీఎంకే ఎప్పుడూ పొత్తుమీదే ఆధారపడుతూ వచ్చింది. అయితే ఈ సారి అన్నా డీఎంకే కూడా పొత్తులకు చాలా ప్రాధాన్యత ఇవ్వక తప్పడం లేదు. ప్రత్యేకించి బీజేపీ ఆ 20 సీట్లను కూడా డిమాండ్ చేసి మరీ.. సాధించుకుంది. జయలలిత లేనిలోటు అన్నడీఎంకేకు ఎన్నికల ముందే తెలుస్తోంది. మరి ఫలితాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి..
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్