మధుమేహ రోగులు కొబ్బరినీళ్లు తాగవచ్చా..? తాగకూడదా..?

దేశంలో చాప కింద నీరులా లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న వ్యాధులలో మధుమేహం కూడా ఒకటి. ఇష్టం వచ్చినట్టు ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, జన్యుసంబంధమైన సమస్యల వల్ల మధుమేహం బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే మధుమేహ రోగులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే షుగర్ లెవెల్స్ అదుపులో పెట్టడం సాధ్యమవుతుంది. Also Read: చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..? మరి […]

Written By: Navya, Updated On : November 28, 2020 10:44 am
Follow us on


దేశంలో చాప కింద నీరులా లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న వ్యాధులలో మధుమేహం కూడా ఒకటి. ఇష్టం వచ్చినట్టు ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, జన్యుసంబంధమైన సమస్యల వల్ల మధుమేహం బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే మధుమేహ రోగులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే షుగర్ లెవెల్స్ అదుపులో పెట్టడం సాధ్యమవుతుంది.

Also Read: చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

మరి మధుమేహ రోగులు తియ్యగా ఉండే కొబ్బరి నీళ్లను తాగవచ్చా..? తాగకూడదా..? అనే ప్రశ్నకు వైద్యులు, శాస్త్రవేత్తలు ఎటువంటి సందేహం అవసరం లేకుండా కొబ్బరినీళ్లు తాగవచ్చని సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు తాగితే షుగర్ లెవెల్స్ పెరుగడం నిజం కాదని వైద్యులు పేర్కొన్నారు. అయితే కొబ్బరి నీళ్లు తగిన స్థాయిలోనే తీసుకోవాలని ఎక్కువగా కొబ్బరి నీళ్లను తీసుకున్నా ప్రమాదమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: వెల్లుల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

కొబ్బరి నీళ్లలో పిండి పదార్థం, పీచు పదార్థం మాత్రమే ఉండటం వల్ల మధుమేహ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. టైప్-2 డయాబెటీస్, ప్రీ-డయాబెటీస్ బాధితులు కొబ్బరి నీళ్లు తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. 200 మిల్లీ లీటర్ల కొబ్బరి నీరు మాత్రమే తీసుకోవాలని అంతకు మించి తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గించడంలో కూడా కొబ్బరి నీళ్లు సహాయపడతాయి.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

కొబ్బరి నీళ్లు జీవక్రియను పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో కృత్రిమ తీపి పదార్థాలు ఉండవు. మధుమేహ రోగుల్లో రక్త ప్రసరణ సమస్యలను తగ్గించడంలో కొబ్బరి నీళ్లు సహాయపడతాయి. అయితే ముదురు కొబ్బరికాయలతో పోలిస్తే లేత కొబ్బరి కాయలను తీసుకుంటే మంచిది.