వి.వి.వినాయక్ కి అసలు హిందీనే రాదు, అలాంటిది ఆయన ఇప్పుడు హిందీలో సినిమా తీస్తున్నాడు. నిజమే.. ఒకప్పుడు టాలీవుడ్ లో వినాయక్ అగ్రదర్శకుడు కాదనలేం. కానీ ప్రస్తుతం ఆయన రేస్ లో పూర్తిగా వెనుకబడిపోయాడు. “అఖిల్”, “ఇంటెలిజెంట్” వంటి దారుణ పరాజయాలు తరువాత వినాయక్ రేంజ్ బాగా పడిపోయింది. ఇప్పటికిప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు అగ్ర హీరోలెవరూ ఆసక్తి చూపడం లేదు అంటేనే.. ప్రస్తుతం వినాయక్ స్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే వినాయక్ చేసిన “లూసిఫర్” రీమేక్ స్క్రిప్ట్ మార్పులకు కూడా చిరంజీవి ఒకే చెప్పలేదు. పాపం మెగాస్టార్ తో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపొయింది.
Also Read: ‘ఆచార్య’.. ‘రాధేశ్యామ్’ మరింత ఆలస్యం.. కారణమేంటి?
దాంతో, ఖాళీగా ఏమి ఉంటాములే అనుకున్నాడో ఏమోగాని, వినాయక్ ఇప్పుడు తన అదృష్టాన్ని బాలీవుడ్ లో టెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. “ఛత్రపతి” సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నాడు. అది కూడా తన “అల్లుడు శీను” హీరో బెల్లంకొండ శీనుతో. అసలు ప్రభాస్ కటౌట్ ఎక్కడా.. బెల్లంకొండ శీను లుక్ ఎక్కడా? ఇక వినాయక్, రాజమౌళి… ఇద్దరూ అటుఇటుగా ఒకే టైంలో దర్శకులు అయి… ఇద్దరూ స్టార్ డైరెక్టర్లు అనిపించుకున్నారు. నిజం మాట్లాడుకుంటే.. రాజమౌళి కన్నా వినాయకే మొదట ఎక్కువ క్రేజ్ వచ్చింది.
Also Read: పూరి స్పీడుకు బ్రేక్ వేసిందెవరు?
“ఆది”, “ఠాగూర్” వంటి సంచలన విజయాలతో ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాకి కొత్త గ్రామర్ నేర్పిన దర్శకుడిగా వినాయక్ కి ఫుల్ క్రెడిట్ దక్కింది. 10 ఏళ్ళు అదే ఊపు కొనసాగించిన వినాయక్ … ఆ తరువాత నుండి హిట్ లేక వరుస ప్లాప్స్ తో పూర్తిగా క్రేజ్ పోగొట్టికుని.. హీరోలను ఒప్పించలేక చివరకు రేసు నుండి తప్పుకున్నాడు. మరి, ఇలాంటి టైంలో పాత చింతకాయ పచ్చడిలాంటి కథతో నేటి తరం హిందీ ప్రేక్షకులను వినాయక్ ఎలా మెప్పించగలడు అనేదే ఇక్కడి ప్రశ్న.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్