Health Tips : వాతావరణంలో మార్పులు వస్తే కొందరికి జలుబు, దగ్గు వంటివి వస్తాయి. కాస్త వర్షంలో తడిచిన సరే.. వెంటనే తుమ్ములు ప్రారంభమై జలుబు వస్తుంది. కొందరికి జలుబు వస్తే తప్పకుండా ఫీవర్ కూడా వస్తుంది. దీంతో కొందరు వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తారు. మరికొందరు తలపై తడి క్లాత్‌ను పెడతారు. ఇల పెట్టడం వల్ల బాడీ టెంపరేచర్ తగ్గుతుందని భావిస్తారు. అయితే నుదిటిపై ఇలా తడి క్లాత్ పెట్టినా కూడా కొందరికి జ్వరం తగ్గదు. అలా అని తడి క్లాత్‌తో అందరికీ జ్వరం తగ్గదని అనుకోకండి. తడి క్లాత్ ఎప్పుడు? ఎలా పెట్టాలో తెలిసి ఉంటే తప్పకుండా జ్వరం తగ్గుతుంది. తడి క్లాత్ పెట్టే విధానం తెలియక.. ఎంత సమయం నుదిటి మీద పెట్టిన కూడా తగ్గడంలేదని వాపోతుంటారు. మరి ఈ తడి క్లాత్‌ను నుదిటి మీద ఏ విధానంలో పెడితే జ్వరం తగ్గుతుందో తెలియాలంటే పూర్తి స్టోరీ చదివేయండి.
జ్వరం తక్కువ టెంపరేచర్ ఉంటే తడి క్లాత్ అవసరం లేదు. కానీ జ్వరం అధికంగా ఉంటే తప్పకుండా తడి క్లాత్‌ను నుదిటి మీద పెట్టాలి. అయితే తడి క్లాత్ పెట్టినంత మాత్రాన జ్వరం తగ్గిపోదు. కేవలం శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో మాత్రమే ఈ తడి క్లాత్ ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సిల్క్ క్లాత్ కాకుండా కేవలం మెత్తగా ఉండే కాటన్ క్లాత్‌ను తీసుకోవాలి. దీనిని శుభ్రం చేసిన తర్వాత మంచి నీటితో మాత్రమే నుదిటిపై కట్టు కట్టాలి. ఏదో నీళ్లలో తడిపి నుదిటిపై పెట్టకూడదు. క్లాత్‌ను నీళ్లలో బాగా నానబెట్టిన తర్వాత సరిగ్గా పిండి అప్పుడు నుదిటి మీద పెట్టాలి. రోజుల తరబడి ఒకే క్లాత్‌ను, అందరికీ అదే క్లాత్‌ను వాడకూడదు. ఎప్పటికప్పుడూ క్లాత్‌ను మారుస్తుంటే.. ఎలాంటి బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ సోకవు. లేదంటే ఆ క్లాత్‌లో బ్యాక్టీరియా, వైరస్ వంటివి ఉండిపోయి.. అనారోగ్య సమస్యలను సృష్టిస్తాయి.
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి మాత్రమే తడి క్లాత్ సహాయపడుతుంది. జర్వం వచ్చిన వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా అసలు మందులు వాడకూడదు. అలాగే ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడంతో పాటు బాడీకి సరిపడా నీరు తాగాలి. జ్వరం వస్తే శరీరం నీరసం అయిపోతుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పోషకాలు ఉండే ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. బయట ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి. చల్లని నీరు తాగకుండా గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి. పండ్ల రసాలు, బలాన్నిచ్చే తాజా పండ్లు తింటే తొందరగా జ్వరం తగ్గుతుంది. లేకపోతే అది కాస్త ఎక్కువ అయ్యి వైరల్ ఫీవర్ కింది మారి ప్రాణాల మీదకు వస్తుంది. కాబట్టి జ్వరం వచ్చినప్పుడే జాగ్రత్తలు వహిస్తే తొందరగా తగ్గుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.