Bananas: నల్ల మచ్చలున్న అరటిపండ్లు ఆరోగ్యానికి మంచివేనా.. వైద్యులేం చెప్పారంటే?

Bananas: మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తినే పండ్లలో అరటిపండ్లు ఒకటనే సంగతి తెలిసిందే. అరటిపండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. అరటిపండ్ల ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అరటిపండ్లు తినడం ద్వారా తక్షణ శక్తి లభించే ఛాన్స్ ఉంటుంది. అయితే మనలో చాలామంది నల్ల మచ్చలున్న అరటిపండ్లు ఆరోగ్యానికి […]

Written By: Navya, Updated On : April 5, 2022 9:17 am
Follow us on

Bananas: మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తినే పండ్లలో అరటిపండ్లు ఒకటనే సంగతి తెలిసిందే. అరటిపండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. అరటిపండ్ల ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అరటిపండ్లు తినడం ద్వారా తక్షణ శక్తి లభించే ఛాన్స్ ఉంటుంది.

అయితే మనలో చాలామంది నల్ల మచ్చలున్న అరటిపండ్లు ఆరోగ్యానికి మంచివని భావిస్తూ ఉంటారు. అరటిపండుపై నల్లటి మచ్చలు ఉంటే ఆ పండ్లు పక్వానికి వస్తున్న పండ్లు అని గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి అరటిపండ్లు తినడం ద్వారా మలబద్ధకం సమస్యతో బాధ పడేవాళ్లు ఆ సమస్యను సులభంగా దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అరటిలో ఉండే పీచు పదార్థాల వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.

అరటిపండ్లు తినడం ద్వారా డయేరియా సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు. గుండెల్లో మంటగా అనిపిస్తే అరటిపండ్లు తినడం ద్వారా ఆ సమస్యను అధిగమించే అవకాశాలు అయితే ఉంటయి. పక్వానికి వచ్చిన అరటిపండ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే.

అరటి పండ్లలో వైరస్ లకు, క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే ఇమ్యూనిటీ పవర్ అయితే ఉంటుంది. అరటిపై ఉండే ఈ మచ్చలు ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ను సూచిస్తాయని చెప్పవచ్చు. అరటిలో ఉండే పొటాషియం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. అందువల్ల అరటిపండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.