Homeహెల్త్‌Is 6 hours of sleep enough daily: ప్రతిరోజు 6 గంటల నిద్ర సరిపోతుందా?...

Is 6 hours of sleep enough daily: ప్రతిరోజు 6 గంటల నిద్ర సరిపోతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Is 6 hours of sleep enough daily: మనిషి ఆరోగ్యానికి సరైన నిద్ర చాలా అవసరం. నేటి కాలంలో రకరకాల కారణాలవల్ల చాలామంది సరైన నిద్ర పోవడం లేదు. అయితే ఇటీవల కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం ప్రతిరోజు ఆరు గంటల నిద్ర సరిపోతుంది అని అంటున్నారు. దీని దృష్టిలో ఉంచుకొని కొందరు తాము ప్రతిరోజు ఆరు గంటలు నిద్రపోతున్నామని అనుకుంటున్నారు. కానీ వారంలో కొన్ని రోజులు ఈ ఆరు గంటలు కూడా నిద్రపోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తాజాగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా నిద్రలేమి వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. రెండు వారాలపాటు నిద్ర తగ్గిస్తే మెదడు సామర్థ్యం తగ్గిపోతుందని.. రెండు రోజులపాటు పూర్తిగా నిద్ర లేని వ్యక్తి గా మారతాడని అంటున్నారు. అసలు ఇలా నిద్ర లేకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

రోజంతా పనిచేసిన వారు విశ్రాంతి తీసుకోవడానికి సరైన నిద్ర అవసరం. రోజు కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోతే మెదడుకు అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. దీంతో జ్ఞాపకాలు స్థిరపడతాయి మెదడు టాక్సీలు తొలగిపోతాయి నాడీ వ్యవస్థ సమతుల్యం అవుతుంది. అయితే సరైన నిద్ర లేకపోతే ఇవి దెబ్బతింటాయి. ప్రతిరోజు కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోతే ఏకాగ్రత లోపిస్తుంది. చిన్న చిన్న పనుల్లో కూడా తప్పులు దొర్లుతాయి. నిర్ణయం తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఏదైనా ఒక పనిని పూర్తి చేయడానికి
ముందుకు రాలేక పోతారు. డ్రైవింగ్ ప్రమాదం పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం ఉండదు. ప్రతి విషయంలో కోపం, ఆందోళన పెరుగుతాయి. నిద్రలో గ్లింపాటిక్ సిస్టం టాక్సిన్లు తొలగిపోవడం వల్ల మెదడు లో ఏదో లోపం ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే క్యాన్సర్ కావచ్చు..!

మనిషి నిద్రపై చేసిన అధ్యయనాల్లో Hans Van Dangen ఒకటి. దీని ప్రకారం ప్రతిరోజు 6 గంటలు లేదా వారంలో 14 గంటల పాటు నిద్రపోవాలి. అయితే కొందరు ఒకరోజు బాగా నిద్రపోయి.. మరొక రోజు తక్కువ నిద్రపోవడం వల్ల కూడా సమస్యలే ఎదురవుతాయి. ప్రతిరోజు నిద్ర గడియారాన్ని ఏర్పాటు చేసుకొని.. కచ్చితంగా అదే సమయంలో నిద్ర పోవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. అయితే నిద్రలేమి సమస్య ఉన్నవారు పైకి బాగానే కనిపిస్తున్నా.. వారికి మాత్రం సమస్య ఉన్నట్లు తెలియదు. మెదడు అలసటకు అలవాటు పడి ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. ప్రముఖ వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రతి వ్యక్తికి 7 నుంచి 9 గంటల పాటు నిద్ర చాలా అవసరం. యువకులకు 8 నుంచి 10 గంటల పాటు, వృద్ధులకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కనీసం 6 గంటల నిద్ర అనేది అపోహ మాత్రమే అని అంటున్నారు. ఇలా ఆరు గంటలు మాత్రమే నిద్ర పోయే వారిలో అల్జిమర్స్ పెరిగే అవకాశం ఉంది. వీరు మిగతా వారి కంటే ఎక్కువగా డిప్రెషన్ కు గురవుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular