https://oktelugu.com/

Richest cat in world : ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి.. దీని ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన నలా అనే పిల్లి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది. ఈ పిల్లి సియామి- టాబి అనే సంకరణ జాతుల వల్ల పుట్టింది. అయితే ఈ పిల్లిని నటషా, లూయిస్ అనే వాళ్లుఐదు నెలలు వయస్సు ఉన్నప్పుడు జంతు సంరక్షణ కేంద్రం నుంచి ఆ పిల్లిని తీసుకొచ్చారు. దీనికి నలా అని పేరు పెట్టి.. ఎంతో ప్రేమగా చూసుకున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 6, 2024 / 05:27 AM IST

    Richest cat in world

    Follow us on

    Richest cat in world :  సాధారణంగా చాలా మంది పెంపుడు జంతువులని పెంచుకుంటారు. ఆ జంతువుల మీద ఉన్న ఇష్టంతో వాళ్లకి ఉన్న ఆస్తులని రాసి ఇస్తుంటారు. ఇలా ఎన్నో జంతువులు కోటీశ్వరులుగా మారాయి. అయితే ప్రపంచంలో ఇలా చాలా జంతువులు ఉన్నాయి. కానీ ఏ జంతువు కూడా తన కష్టార్జితంతో సంపాదించి లేదు. కానీ ఇప్ప్పుడు చెప్పబోయే జంతువు తన కష్టార్జితంతో కోట్ల ఆస్తిని సంపాదించింది. ఇంతకీ ఆ జంతువు ఏది? పూర్తి వివరాలు తెలియాలంటే.. స్టోరీ చదివేయండి.

    అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన నలా అనే పిల్లి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది. ఈ పిల్లి సియామి- టాబి అనే సంకరణ జాతుల వల్ల పుట్టింది. అయితే ఈ పిల్లిని నటషా, లూయిస్ అనే వాళ్లుఐదు నెలలు వయస్సు ఉన్నప్పుడు జంతు సంరక్షణ కేంద్రం నుంచి ఆ పిల్లిని తీసుకొచ్చారు. దీనికి నలా అని పేరు పెట్టి.. ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అయితే ఈ పిల్లికి ఫోటోలు ఎక్కువగా తీసేవారు. ఇలా ఆ పిల్లికి సోషల్ మీడియాలో ఒక అకౌంట్ క్రియేట్ చేశారు. ఈ ప్రొఫైల్ ద్వారా ఆ పిల్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునేవారు. పిల్లి దాని ఫోటోలు క్యూట్ గా ఉండటంతో అందరూ ఆ అకౌంట్ ని ఫాలో అయ్యారు. అలా సోషల్ మీడియా లో దాదాపుగా 4.5 మిలియన్ల ఫాలోవర్స్ సంపాదించుకుంది. ఇలా ఎక్కువ మంది ఫాలో అయ్యే పిల్లిగా.. 2020 లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది.

    నలాని పెంచుకున్నవాళ్లు ఆ తరువాత ఫేసుబుక్ లో ఒక పేజీ క్రియేట్ చేశారు. ఇది కూడా బాగా ఫేమస్ అయ్యింది. నలా హౌస్ రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉండేది. దీంతో ఇది రోజూ కూడా వెళ్లేది. దీనిని చూడటానికి కూడా చాలా మంది వచ్చేవారు. నలా మెదడుకి తన యజమాని అడ్రస్ కాలర్ ఉంటుంది. అలాగే జిపిఎస్ కూడా ఉంటుంది. దీంతో ఇది ఎక్కడికి వెళ్లిన ఈజీగా తెలిసిపోతుంది. నలా ఇలా బాగా పాపులర్ కావడంతో.. లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్ అకార్డింగ్ టు నలా క్యాట్ అనే ఒక ఈ బుక్ ను ప్రారంభించారు. అయితే ఈ బుక్ చదవడానికి కొంత ఫీజ్ అనేది కట్టాలి. ఇలా ఆ పిల్లి సంపాదన మొదలయింది. ఆ తరువాత లవ్ నలా పేరుతో ఒక పిల్లి ఫుడ్ బ్రాండ్ కూడా మొదలుపెట్టారు. ఇలా సోషల్ మీడియా ప్రకటనలు, కంపెనీలతో టై అప్ అయి డబ్బు సంపాదించుకుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా నలా సంపాదించిన డబ్బు మొత్తం 839 కోట్ల రూపాయిలు. తన కష్టంతో ఇలా సంపాదించి.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లిగా మారింది.