Interesting Facts: పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకరోజు మరణించక తప్పదు. కొంతమంది వ్యాధుల వల్ల మృతి చెందుతుంటే మరి కొందరు వృద్ధాప్యంలో వేధించే ఆరోగ్య సమస్యల వల్ల మృతి చెందుతున్నారు. అయితే చనిపోయే ముందు మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో తెలుసుకోవాలని చాలామంది భావిస్తారు. అయితే లూయీవిల్లె యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మరణం తర్వాత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
చనిపోయే ముందు మానవులకు లైఫ్ అంతా మూవీ రీల్ లా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు సైతం ధృవీకరిస్తున్నారు. 87 సంవత్సరాల వృద్ధుడు మూర్చ రోగంతో ఆస్పత్రిలో చేరి గుండెపోటుతో మరణించగా ఆ వృద్ధుడు చనిపోవడానికి ముందు పావుగంట పాటు రికార్డ్ అయిన మెదడు తరంగాలను శాస్త్రవేత్తలు పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు.
ఆ వృద్ధుడు గుండె ఆగిపోయేముందు తన లైఫ్ లో జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకున్నారని చనిపోయే సమయంలో ప్రతి మనిషికి తమ లైఫ్ లోని ముఖ్యమైన సంఘటనలు గుర్తుకు వస్తాయని శాస్త్రవేత్తల మాటల ద్వారా వెల్లడైంది. ఎలుకల్లో కూడా ఈ తరహా తరంగాలను గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలో రక్తప్రసరణ ఆగిపోయిన తర్వాత కూడా మెదడు కొంత సమయం పాటు పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందనే విషయానికి సంబంధించి మనుషుల్లో చాలా అపోహలు నెలకొన్నాయి. అయితే శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా అపోహలకు సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.