Mega Brothers: అన్నదమ్ములు ఉంటే జీవితంలో ఒక భరోసా ఉంటుంది. అన్నయ్య లేదా తమ్ముడు మనిషికి దేవుడు ఇచ్చిన ఒక అండ. కొన్ని ఫ్యామిలీస్ ను చూస్తే.. ఇది నిజమే అనిపిస్తుంది. తెలుగు తెర పై మెగా బ్రదర్స్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, ఆ అన్నదమ్ముల అనుబంధం అనేక సందర్భాల్లో ప్రస్పుటమైంది కూడా. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు మెగా బ్రదర్స్.
పైగా ఆర్జీవీ లాంటి ఎంతోమంది వారి మధ్య దూరం పెంచాలని ప్రయత్నాలు చేసినా.. రాజకీయాలు కూడా మెగా బ్రదర్స్ మధ్య అపోహలు క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా… ఎన్నడూ మెగా కుటుంబంలో చీలిక రాలేదు. పవన్ సొంత పార్టీ పెట్టినా.. చిరంజీవిపై ఉన్న అభిమానం విషయంలో ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఇక తమ్ముడు పవన్ పై ఉన్న ఆప్యాయతను, అనురాగాన్ని చిరు ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉంటారు.
Also Read: టాలీవుడ్ సెలెబ్రిటీల బ్రదర్స్ – సిస్టర్స్ రిలేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసా?
నాగబాబుకు అయితే, తన అన్నయ్య చిరు, తమ్ముడు పవన్ అంటే ప్రాణం. తన జీవితంలో వచ్చిన ఎన్నో కష్టాలను తన సోదరులే తిర్చారని నాగబాబు ఎన్నోసార్లు బాహాటంగానే చెప్పాడు. ముఖ్యంగా తాను అప్పుల వలయంలో పూర్తిగా కూరిపోయిన సమయంలో నాగబాబుకు అండగా నిలబడింది చిరు, పవన్ మాత్రమే. ఇక టాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీగా మెగాస్టార్ ఫ్యామిలీ ఉంది.
చిరుకి ఇద్దరు తమ్ముళ్లు ఒకరికొకరు తోడుగా ఉంటూ అన్ని విషయాల్లో కలిసిమెలసి ఉంటున్నారు. ఒక విధంగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన తర్వాత అన్నదమ్ములు రాజకీయ వేదిక మీద ఎప్పుడూ కలిసి కనిపించలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో చిరు – పవన్ అన్నదమ్ములు ఇద్దరూ కలవాలని.. చిరు జనసేనకు సపోర్ట్ చేయాలని ఎప్పటి నుంచో మెగా అభిమానుల్లో డిమాండ్ ఉంది.
మరి ఈ అన్నదమ్ముల అనుబంధం పొలిటికల్ స్క్రీన్ మీదకు వస్తే.. పవన్ కి చాలా ప్లస్ అవుతుంది. అలాగే రావాలని ఆశిద్దాం.
Also Read: ఓటీటీలోకి రాబోతున్న రవితేజ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా !