Insurance Coverage Guide: ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్యవసరాలతో పాటు health Insurance కూడా తప్పనిసరిగా మారింది. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఇన్సూరెన్స్ తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఆపద వచ్చినా బయటపడే అవకాశం ఉంటుంది. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యం పై అందరికీ అవగాహన పెరిగిపోతుంది. దీంతో విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక అవసరాల కోసం ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరిగా మారింది.
అయితే కొందరు ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. వేలకు వేలు డబ్బులు పెట్టి ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేస్తున్నా.. వీటిలో సరైన ఆప్షన్లు ఎంచుకోకపోవడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగపడుతుందని కొందరు అనుకుంటున్నారు. కానీ సాధారణ హెల్త్ చెకప్ కూడా ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అది ఎలా అంటే?
Also Read: పాఠం చెప్పిన చంద్రబాబు.. శ్రద్ధగా విన్న లోకేష్!
ఏడాదిలో ఒకసారి అయినా ప్రతి ఇంట్లో అనారోగ్య సమస్య తప్పనిసరిగా వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇంట్లో ఆరోగ్య అవసరాలు కచ్చితంగా ఉంటాయి. ఇందుకోసం ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆస్పత్రులకు వెళ్లిన ప్రతిసారి వేలకు వేలు ఖర్చు అవుతుంది. అయితే కొందరు ఇలా రెగ్యులర్గా ఆసుపత్రులకు వెళ్లేవారు ఇన్సూరెన్స్ తీసుకున్నా.. అది కేవలం ఆపరేషన్ లేదా ఇతర సమయాల్లో మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ ఆ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలోనే ఒక చిన్న ఆప్షన్ను ఎంచుకుంటే.. ఇలా సాధారణ చెకప్ కు వెళ్ళినప్పుడు సైతం డబ్బులు తగ్గే అవకాశం ఉంటుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో ఈ చిన్న ఆప్షన్ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ ఆప్షన్ను ఎంచుకుంటే ఓపి రిజిస్ట్రేషన్ కు కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో అదనంగా Be Fit C, అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ను ఎంచుకోవడం ద్వారా ఎప్పుడు ఆస్పత్రులకు వెళ్లిన చిన్న చిన్న అవసరాలకు కూడా ఇన్సూరెన్స్ వర్తించే అవకాశం ఉంది. ఉదాహరణకు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఆసుపత్రులకు వెళ్తే ఓపి రిజిస్ట్రేషన్ తో సహా ల్యాబ్ టెస్ట్, ఎక్స్రే వంటి వాటికి కూడా ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. సాధారణంగా ఇలా ఆసుపత్రికి వెళ్తే ఓపి రిజిస్ట్రేషన్ తో పాటు ల్యాబ్ టెస్ట్, ఎక్స్రే లేదా ఇతర వంటి వాటికీ కలిపి కనీసం రూ. ఐదు నుంచి పదివేల వరకు ఖర్చు అవుతుంది. ఇలా ఏడాదికి రెండు మూడు సార్లు వెళ్తే కనీసం 50,000 వరకు వెచ్చించే అవకాశం ఉంటుంది. అయితే ఈ బి ఫిట్ సి అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఈ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు.
Also Read: కింగ్డమ్’ మరోసారి వాయిదా పడబోతోందా..? కారణాలు చూస్తే ఆశ్చర్యపోతారు!
అయితే ఈ పాలసీ ఫ్యామిలీ మొత్తానికి తీసుకునే దానికి మాత్రమే వర్తిస్తుంది. అంతేకాకుండా అదనంగా బీ ఫిట్ సి అనే ఆప్షన్ను ఎంచుకుంటే మినిమం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలను బట్టి ఉంటుంది. అందువల్ల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేవారు దీనిని కూడా ఎంచుకొని ఆసుపత్రుల ఖర్చుల నుంచి బయటపడండి..