Chandrababu school teaching: ఏపీ వ్యాప్తంగా ఈరోజు మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్స్( Mega parents teachers meetings ) జరిగాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైన నెల రోజుల తర్వాత ఈ సమావేశాలు నిర్వహించడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మంది తల్లిదండ్రులతో ఈరోజు సమావేశాలు నిర్వహించారు. ఇదే రోజు తల్లికి వందనం పథకం కింద రెండో విడత నిధులు జమ చేశారు. మరోవైపు సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం పాల్గొన్నారు. ఉదయాన్నే చంద్రబాబుతో పాటు లోకేష్ పాఠశాలకు చేరుకున్నారు.
Also Read: జగన్ ను లేపుతున్న కూటమి.. ఏరికోరి ప్రచారం!
ఉపాధ్యాయుడిగా చంద్రబాబు..
సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. తరగతి గదిలో బోధన చేశారు. వనరులు అనే అంశంపై విద్యార్థులకు బోధించారు. వారి నుంచి సమాధానాలు రాబట్టారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు విద్యార్థులకు కుశల ప్రశ్నలు వేశారు. పాఠశాల విద్యా బోధన, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.
కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు,మంత్రి లోకేష్
‘వనరులు’ మీద పిల్లలకు పాఠం చెప్పిన సీఎం @ncbn , పిల్లలతో కలిసి కూర్చొని పాఠం విన్నా మంత్రి @naralokesh pic.twitter.com/dWEU8KrB62
— greatandhra (@greatandhranews) July 10, 2025
సరికొత్తగా పథకాలు
ఈ ఏడాది జూన్ 12న విద్యా సంవత్సరం( academic year ) ప్రారంభం అయింది. అదే రోజు ప్రభుత్వ విద్యకు సంబంధించి కీలక పథకాలు కూడా ప్రారంభమయ్యాయి. 12 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను విద్యార్థులకు అందించారు. సన్న బియ్యంతో కూడిన ఆహారాన్ని మధ్యాహ్నం భోజనం కింద అందించారు. ఇంకోవైపు ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలు 13 వేల రూపాయల చొప్పున తల్లికి వందనం పథకం కింద నిధులు జమ చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపజేశారు. సరికొత్త విద్యాసంస్కరణలు అమలు చేయడం ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. వీటన్నింటినీ తల్లిదండ్రులకు వివరించేందుకు ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. అందులో భాగంగా కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం అయ్యారు. వారితో సెల్ఫీలు దిగారు. దీంతో పాఠశాల ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది.