Insomnia: మన ఆరోగ్యానికి ఆహారంతోపాటు సరైన నిద్ర చాలా అవసరం. ప్రతి వ్యక్తి కంటి నిండా నిద్రపోతేనే ఉత్సాహంగా ఉండగలుగుతారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా రకాల కారణాలతో నిద్రపోవడం లేదు. కొందరు ఉద్యోగం లేదా వ్యాపారం నిమిత్తం బిజీగా ఉండడంతో సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రిళ్ళు ఎక్కువసేపు మెలకువతో ఉండి నిద్రను చెడగొట్టుకుంటున్నారు. నిన్నటి వరకు నిద్రలేమితో తలనొప్పి, మానసిక సమస్యలు మాత్రమే ఉండేవని వైద్యులు చెప్పారు. కానీ తాజాగా అమెరికాకు చెందిన ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ నిద్రలేమి ఫై చేసిన అధ్యయనం షాప్ ఇస్తుంది. నిద్ర లేకపోతే ఆయుష్షు కూడా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఆ సమస్య ఎలా వస్తుందంటే?
ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ డిసెంబర్ 8న స్లీప్ అడ్వాన్స్ జర్నల్లో ఒక అధ్యయనం ప్రచురించింది. ఈ అధ్యయన ప్రకారం మనుషులకు సరైన నిద్ర లేకపోతే ప్రమాదం ఉందని తేల్చింది. ఈ పరిశోధన కోసం 2019 నుంచి 2025 మధ్య డేటా సేకరించారు. ఒక వ్యక్తి ఆయుష్షు ఆహారం, వ్యాయామం కంటే సరైన నిద్రనే పెంచుతుంది. కానీ ధూమపానం మాత్రం ఆయుష్షును తగ్గిస్తుంది. అయితే నిద్రలేమితో ధూమపానంతో సమానంగా ఆయుష్షును తగ్గిస్తుంది అని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనలు ఈ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లోని స్లీప్, క్రోనో బయాలజీ విద్యార్థులు నిర్వహించారు. వివిధ రకాల సానుకూల ఆరోగ్య ఫలితాలకు సరైన నిద్ర చాలా అవసరమని దీని ద్వారా అర్థం చేసుకున్నారు. తగినంత లేకపోవడం వల్ల గతంలో కంటే ఇప్పుడు చేసే పరిశోధనలు మరణాల శాతం ఎక్కువగా చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఒక వ్యక్తి కనీసం ఏడు గంటల పాటు నిద్రపోవాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ సిఫార్సు చేసింది. ప్రస్తుత కాలంలో అమెరికాలో చాలామంది సగం నిద్ర మాత్రమే పోతున్నారని పేర్కొంది. దీంతో చాలామంది సగం జీవితమే గడుపుతున్నారని అంటున్నారు.
మనం తినే ఆహారం కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో.. నిద్రకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఈ పరిశోధకులు తెలుపుతున్నారు. కొన్నిసార్లు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి నిద్రపోయే ప్రయత్నం చేయాలని అంటున్నారు. వారానికి కనీస గంటలు నిద్రపోతేనే ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. మంచి నిద్ర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిద్రలేమి ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అని ఈ పరిశోధకులు తెలిపారు.