Mpox Cases India: కరోనా లాగా దేశాన్ని ఎంపాక్స్ కమ్మేస్తుందా? మరో లాక్ డౌన్ వస్తుందా?

ఆఫ్రికాలో కొన్ని దేశాలలో ఎం ఫాక్స్ లేదా మంకీ ఫాక్స్ విపరీతంగా విస్తరిస్తోంది. తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉంది.. ఫలితంగా ఐక్యరాజ్యసమితి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 10, 2024 11:04 am

Mpox Cases India

Follow us on

Mpox Cases India: 2021- 2022 కాలంలో ప్రపంచాన్ని కరోనా ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైరస్ వల్ల సంక్రమించిన ఆ వ్యాధి దేశాలకు దేశాలనే వణికించింది. చైనా లాంటి దేశం మూడు సంవత్సరాల పాటు అధికారికంగా కొన్నిసార్లు, అనధికారికంగా కొన్నిసార్లు లాక్ డౌన్ విధించింది. అలా విధించడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచం కుదుటపడుతున్న సమయంలో.. మరో వ్యాధి ప్రమాదకరంగా మారింది.

ఆఫ్రికాలో కొన్ని దేశాలలో ఎం ఫాక్స్ లేదా మంకీ ఫాక్స్ విపరీతంగా విస్తరిస్తోంది. తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉంది.. ఫలితంగా ఐక్యరాజ్యసమితి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వ్యాధి తీవ్రత వల్ల ఇప్పటికే డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 450 మంది కన్నుమూశారు. ఈ వ్యాధికి కొత్త వేరియంట్ కారణమని.. అది విస్తరిస్తున్న తీరు, మరణాలకు దారితీస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎం ఫాక్స్ కొత్త స్ట్రైన్ వేగంగా విస్తరిస్తోంది. దీనిపై అన్ని దేశాలను ఇప్పటికే అప్రమత్తం చేసినట్టు ఆఫ్రికా సెంటర్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన 15,600 మంది పడ్డారు.

లక్షణాలు ఎలా ఉంటాయంటే

ఈ వ్యాధి సోకిన వారి శరీరం మొత్తం నీటిని కలిగి ఉన్న చిన్న చిన్న బొబ్బలు ఏర్పడతాయి. ఈ వ్యాధి సోకిన జంతువులను ముట్టుకుంటే అది మనుషులకు కూడా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తితో శృంగారంలో పాల్గొనడం.. వారిని పదేపదే తాకడం.. సమీపంలోకి వెళ్లి మాట్లాడటం వల్ల ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం ఉంటుంది. కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. శరీరంపై నీటి బొబ్బలు ఏర్పడతాయి. వ్యాధికి సత్వరమే చికిత్స అందకపోతే ప్రాణాపాయానికి దారి తీసే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కు సంబంధించిన రెండు స్ట్రైన్లు ప్రస్తుతం అస్తిత్వంలో ఉన్నాయి. 2022లో స్వల్ప లక్షణాలు ఉన్న ట్రైన్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. అయితే ఇది శృంగారపరమైన సంబంధాల ద్వారా విస్తరించినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్న స్ట్రైన్ అత్యంత ప్రమాదకరమైనది. ఇది డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో విపరీతంగా విస్తరిస్తోంది. అయితే దీనికి సెంట్రల్ ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన వేరియంట్ కారణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు..

మ్యూటేట్ అవుతున్నట్టు గుర్తించారు.

ఎం ఫాక్స్ వైరస్ ను 1950 చివరలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే గత నాలుగేళ్లుగా ఈ వైరస్ మ్యూటేట్ అవుతున్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఫలితంగా ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు తేలికగా సంక్రమిస్తుంది. మొదటగా ఈ వ్యాధిని డెన్మార్క్ లోని ఒక లాబరేటరీలో కోతుల్లో గుర్తించారు.. అయితే ఈ వ్యాధికి కోతులు మూల కేంద్రాలు కావని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే ఈ వ్యాధి ఎలుకల నుంచి పుట్టుకొస్తుందని తెలుస్తోంది. అయితే అది ఇంకా నిర్ధారణ కాలేదని శాస్త్రవేత్తలు అంటున్నా. 2022 చివర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ ఫాక్స్ పేరును కాస్త ఎం ఫాక్స్ గా మార్చింది. మరోవైపు ఎం ఫాక్స్ కు కరోనా కు పోలికలు దగ్గరగా ఉన్నాయి. కోవిడ్ కంటే ముందే ఈ వైరస్ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఒకవేళ ఈ వ్యాధి విస్తరిస్తే.. కోవిడ్ సమయంలో మాదిరిగానే లాక్ డౌన్ విధించే పరిస్థితులను కొట్టి పారేయలేమని వారంటున్నారు.

1958లో కనుగొన్నప్పటికీ..

1958 లో ఎం ఫాక్స్ వైరస్ ను కనుగొన్నప్పటికీ 1970 వరకు ఇది మనుషుల్లో వ్యాపించిన దాఖలాలు లేవు. ఇటీవల కాంగో దేశం లో ఒక తొమ్మిది నెలల బాలుడిని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించినప్పుడు.. అతడికి ఎం ఫాక్స్ వైరస్ దొరికినట్టు వైద్యులు గుర్తించారు. అయితే ఆ బాలుడి కుటుంబం కోతులు ఎక్కువగా ఉండే అటవీ ప్రాంతంలో నివసిస్తోంది. అయితే ఆ బాలుడు కోతుల కాంటాక్ట్ లో కి వెళ్లి ఉంటాడని వైద్యులు అనుమానిస్తున్నారు. మొదట్లో ఆ బాలుడు కోలుకున్నప్పటికీ.. ఆ తర్వాత కొద్ది రోజులకే పొంగు సోకి చనిపోయాడు. వాస్తవానికి ఈ వైరస్ ఆఫ్రికా దేశంలో పలు ప్రాంతాలలో విస్తరించినప్పటికీ.. ఈ వ్యాధి లక్షణాలు మశూచిని పోలి ఉండడంతో.. వైరస్ ను కనుక్కోలేకపోయారు.. కరోనా ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటున్న నేపథ్యంలో ఈ వైరస్ విజృంభించడం సంచలనంగా మారింది.