https://oktelugu.com/

Chiranjeevi: అక్కినేని కుటుంబం నుంచి ‘మనం ‘ సినిమా వచ్చింది..ఇక ‘మెగా ఫ్యామిలీ’ మూవీ వచ్చేది ఎప్పుడో తేల్చేసిన చిరంజీవి….

చాలామంది హీరో లు మంచి సినిమాలను చేసి ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే, మరి కొంతమంది మాత్రం సోలోగా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోలుగా ఎదుగుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 10, 2024 / 11:18 AM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీ లకు మంచి గుర్తింపు అయితే ఉంది. నిజానికి ఈ ఫ్యామిలీ లో నుంచి వచ్చిన హీరోలు కూడా ప్రేక్షకులను అలరిస్తూ టాప్ హీరోలుగా ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య కొన్ని తగాదాలు ఉన్నాయి అనే విషయాలు ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున కొడుకులు అయిన నాగచైతన్య, అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి రావడమే కాకుండా ఇక్కడ తన స్టార్ డమ్ ను విస్తరింపజేసి చాలా సంవత్సరాల పాటు మెగాస్టార్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్ళ ఫ్యామిలీ నుంచి దాదాపు 5 నుంచి ఆరుగురు హీరోలు ఉండటం విశేషం. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు హీరోలుగా పరిచయం అయ్యారు. ఇక వాళ్లని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి మనం అనే ఒక సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. నిజానికి ఇది అక్కినేని ఫ్యామిలీ బయోపిక్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సినిమాతో నాగార్జున చాలా వరకు మంచి బాండింగ్ అయితే కలిగి ఉన్నాడు. అందుకే ఈ సినిమాలో నాగేశ్వరరావుని సైతం భాగం చేసి ఈ సినిమాని తెరకెక్కించారు.

    ఇక అక్కినేని అభిమానులు కూడా ఈ సినిమా పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీ భారీ సక్సెస్ సాధించడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీకి మెమొరబుల్ మూవీ గా నిలిచిపోయింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మనం లాంటి సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    నిజానికైతే ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అలాంటి ఒక సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఇక చిరంజీవి మాత్రం ఒక మంచి కథ దొరికితే ఎప్పుడైనా సరే మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ అందరూ కలిసి నటించదానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.

    మరి అలాంటి కథను రెడీ చేసే దర్శకులు ఎవరున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…కానీ తొందర్లోనే మెగా ఫ్యామిలీ కలిసి నటించే సినిమా ఒకటి రాబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది…