Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండో వారంలో అడుగుపెట్టింది. మొదటివారానికి గాను బేబక్క ఎలిమినేట్ అయ్యింది. ఆరుగురు నామినేట్ కాగా… ఒక్కొక్కరు సేఫ్ అయ్యారు. చివరికి నాగ మణికంఠ, బేబక్క మిగిలారు. వీరిద్దరిలో బేబక్క ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. బేబక్క ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్లో 13 మంది మిగిలారు. ఈ సోమవారం సెకండ్ వీక్ నామినేషన్స్ మొదలయ్యాయి.
ప్రతి కంటెస్టెంట్ తగు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేసిన కంటెస్టెంట్ పై రంగు నీళ్లు పోయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. కాగా సోనియా ఆకుల-విష్ణుప్రియ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. కారణాలు చెప్పే క్రమంలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. విష్ణుప్రియపై సోనియా పర్సనల్ అటాక్ కి దిగింది. విష్ణుప్రియ జోక్స్, డ్రెస్సింగ్ ని ఉద్దేశిస్తూ ఘాటైన కామెంట్స్ చేసింది. అలాగే విష్ణుప్రియ ఫ్యామిలీ మేటర్స్ కూడా ఆమె ఎత్తింది.
విష్ణుప్రియ అడల్ట్రీకి పాల్పడుతుంది. ఆమె అడల్ట్ జోక్స్ వేస్తుందని సోనియా తప్పుబట్టింది. తనతో సన్నిహితంగా ఉండే కంటెస్టెంట్స్ ని మినహాయించి మిగతా కంటెస్టెంట్స్ పై ఆమె అడల్ట్ జోక్స్ వేస్తుంది. విష్ణుప్రియ డెస్సింగ్ కూడా సరిగా లేదు. నువ్వు దుస్తులు సరిగ్గా ధరించడం నేర్చుకో అని విష్ణుప్రియతో సోనియా అన్నారు. నీ పక్కన నిల్చున్న కంటెస్టెంట్ కూడా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాడని సోనియా ఆరోపించింది. అడల్ట్ జోక్స్, డ్రెస్సింగ్ తో అడల్ట్ కంటెంట్ ఇచ్చేందుకే హౌస్లోకి విష్ణుప్రియ వచ్చింది అన్నట్లు సోనియా మాట్లాడింది.
అలాగే విష్ణుప్రియకు అమ్మానాన్న లేరన్న విషయాన్ని కూడా సోనియా లేవనెత్తింది. నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడరు. నాకు ఫ్యామిలీ ఉంది. బాధ్యతగా వ్యవహరించాలి… అనే అర్థంలో సోనియా అన్నారు. సోనియా వ్యక్తిగతంగా విష్ణుప్రియను టార్గెట్ చేయడం పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోనియా అంతలా టార్గెట్ చేసినా విష్ణుప్రియ సహనం కోల్పోలేదు. సరైన కారణాలు చూపుతూ నామినేట్ చేసే ప్రయత్నం చేసిందన్న వాదన వినిపిస్తోంది. సోనియా ఇతర కంటెస్టెంట్స్ ని జడ్జి చేయడం మానేయాలని పలువురు హితవు పలుకుతున్నారు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 8 ఆరంభం ఏమంత బాగోలేదు. షో మజాగా సాగడం లేదన్న అభిప్రాయం ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్పీ కూడా ఆశించిన స్థాయిలో లేదంటున్నారు.
కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాతైనా షో ఊపందుకుంటుందేమో చూడాలి. ఐదు వారాల అనంతరం మరో 5 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళతారట. ఈసారైన పేరున్న ప్రముఖలను హౌస్లోకి పంపాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.