Husband And Wife Relationship: కార్యేషుదాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత.. అన్నారు ప్రముఖ కవులు. మహిళ పుట్టినప్పటి నుంచి మరణించేవరకు వివిధ పాత్రల్లో కనిపించింది. తల్లిగా, చెల్లిగా, భార్యగా వివిధ రకాల పాత్రల్లో కనిపిస్తూ వివిధ సేవలను చేస్తుంది. తనకు ఎంత కష్టం కలిగినా, ఎన్ని ఇబ్బందులున్నా తన వారి బాగుగకోసం ఎన్నో త్యాగాలను చేస్తుంది. అయితే ఒక మహిళకు జీవితలో భార్య పాత్ర అత్యంత కీలకమైనది. ఓ వైపు కుటుంబం కోసం ఎన్నో పనులు చేస్తూనే తమ వారిపై ప్రేమను చూపిస్తు ఉంటుంది. కానీ చాలా మంది భర్తలు భార్య ప్రేమను పొందేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే ఈ సమస్య అస్సలు ఉండదు. ఇటీవల కోరా అనే కొశ్చెనీర్ లో భార్గవి కుర్మాదాస్ అనే వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు. ‘ఒక భార్య భర్తను అమితంగా ప్రేమించాలంటే ఏం చేయాలి?’ అని అడగ్గా ఒకరు కొన్ని సలహాలు ఇచ్చారు. అవేంటంటే?
మరో మహిళతో పోలిక:
భార్యను ఎప్పుడూ మరో స్త్రీతో పోల్చకూడదు. ముఖ్యంగా అందం విషయంలో ఇతరులతో కంపేర్ చేయడం వల్ల తనను చిన్న చూపు చూసినట్లుగా ఫీలవుతుంది. బయటి వారు ఎంత అందంగా ఉన్నా తన భార్యే తనకు సర్వస్వం అనే విధంగా ప్రవర్తించాలి. ఇలా చేయడం వల్ల భర్తపై నమ్మకం పెరుగుతుంది.
భార్య ఫీలింగ్స్ గౌరవించాలి:
ఉద్యోగం, వ్యాపారం సందర్భంగా భర్త బయట తిరుగుతారు. పలువురితో మాట్లాడుతారు. కానీ ఇంట్లో ఉండే భార్యలు తమ కష్ట సుఖాలను భర్తతో మాత్రమే పంచుకుంటారు. ఇలాంటి సమయంలో తమ గురించి చెప్పేటప్పుడు భర్త ఓపిగ్గా వినాలి. అలా చేయకపోతే భర్త తనను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఏర్పడుతుంది. దీంతో ఫ్యూచర్లో మరిన్ని విషయాలు చెప్పదు.
అందరిముందు కించపరుచొద్దు:
భార్యపై ఎప్పుడూ సున్నితంగా ప్రవర్తించాలి. ముఖ్యంగా పదిమందిలో ఆమె గురించి మంచి విషయాలు మాత్రమే చెప్పాలి. గొప్పలు చెప్పకపోయినా పర్వాలేదు. కానీ కించపరిచే విధంగా మాట్లాడితే తొందరగా హర్ట్ అవుతారు. దీంతో భర్తపై పగ పెంచుకుంటారు.
పిల్లల ముందు అస్సలు తిట్టకూడదు:
ఇంట్లో పిల్లల ముందు భార్యను తిట్టడం ద్వారా పిల్లలకు లోకువగా మారుతారు. అలా వారికి అలవాటుగా మారి తల్లిని పట్టిచుకోకపోవడంతో పాటు వారికి గౌరవం ఇవ్వరు. దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
తగినంత భరోసా ఇవ్వాలి:
భార్య ఏదైనా పని చేసేటప్పుడు తనకు అండగా ఉన్నాననే ధైర్యం ఇవ్వాలి. అలా చేయడం వల్ల మరింత యాక్టివ్ అవుతారు. అయితే ఆమె చేసే పనుల్లో లోపాలు చెప్పడం వరకుఓకే. కానీ హేళన చేస్తే మాత్రం అస్సలు సహించరు.