కరోనా సోకిందా.. తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలివే..?

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. లక్షణాలు కనిపించకుండానే చాలామందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. అయితే కరోనా సోకకపోయినా కొంతమందిని వైరస్ భయం వెంటాడుతోంది. కరోనా పరీక్షలు చేయించుకునే లోపు పాజిటివ్ రావడంతో కొంతమంది తెగ టెన్షన్ పడుతున్నారు. భయం వల్లే కరోనాతో ప్రాణాలు పోతున్న ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. కరోనా లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కనిపించినా వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాధికి సకాలంలో గుర్తించి ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ […]

Written By: Navya, Updated On : May 5, 2021 9:48 am
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. లక్షణాలు కనిపించకుండానే చాలామందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. అయితే కరోనా సోకకపోయినా కొంతమందిని వైరస్ భయం వెంటాడుతోంది. కరోనా పరీక్షలు చేయించుకునే లోపు పాజిటివ్ రావడంతో కొంతమంది తెగ టెన్షన్ పడుతున్నారు. భయం వల్లే కరోనాతో ప్రాణాలు పోతున్న ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి.

కరోనా లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కనిపించినా వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాధికి సకాలంలో గుర్తించి ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాకు చెక్ పెట్టడం కష్టం కాదని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దక్షిణ కొరియా లాంటి దేశాలు కరోనాపై విజయం సాధించాయి. మాస్క్ వాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తే కరోనాకు చెక్ పెట్టడం సులువేనని చెప్పవచ్చు.

మాస్క్ పై ఏవైనా మడతలు ఉంటే అవి కింది వైపుకు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వృద్ధులు, పిల్లలు ఉండి వైరస్ బారిన పడితే ఇంట్లోని మిగిలిన వాళ్లే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా విషయంలో ప్రజలు అవగాహనను కలిగి ఉండి భయాన్ని పోగొట్టుకోవాలి. మాస్కుల వాడకంలో లోపాల వల్లే చాలామంది కరోనా బారిన పడుతుండటం గమనార్హం. కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది.

ఆక్సీ మీటర్ సహాయంతో తరచూ ఆక్సిజన్ లెవెల్స్ ను చెక్ చేసుకోవడం ద్వారా కూడా వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు, ప్రజలు కలిసి కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటే వైరస్ కు చెక్ పెట్టడం కష్టం కాదని చెప్పవచ్చు.