Passion Fruit : ఫ్యాషన్ ఫ్రూట్ తిన్నారా.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే బిత్తరపోతారు

తినడానికి ఈ పండు చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏ సీజన్ అయిన సరే.. ఈ ఫ్యాషన్ ఫ్రూట్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ పండును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మరి చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : September 24, 2024 12:04 pm

Passion Fruit

Follow us on

Passion Fruit :  పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వీటిని డైలీ తింటుంటారు. రోజూ పండ్లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు అందంగా కూడా ఉంటారని అంటుంటారు. అయితే మనకి తెలియకుండా చాలా పండ్లు ఉన్నాయి. అందులో ఒకటి ఫ్యాషన్ ఫ్రూట్. ఈ పండు గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. ఇది ఎక్కువగా కొండల్లో పండుతుంది. ఈ పండు ఇతర దేశాలకు చెందినది. అయితే మన దేశంలో దీనిని కృష్ణ పండు అని అంటారు. తినడానికి ఈ పండు చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏ సీజన్ అయిన సరే.. ఈ ఫ్యాషన్ ఫ్రూట్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ పండును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మరి చూద్దాం.

ఈ కృష్ణ పండులో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫాలీఫెనాల్స్, యంటీ ఆక్సిడెంట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల నష్టాన్ని తగ్గించండంలో ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఎక్కువ అవుతాయి. అదే వీటిని నివారించడానికి ఈ పండును తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లకి ఫైబర్ చక్కగా పనిచేస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంతో పాటు మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గేలా చేస్తుంది. ఇందులోని విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. అలాగే చర్మంపై మచ్చలు వంటివి రాకుండా ఉంచడంలో కూడా ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఫ్యాషన్ ఫ్రూట్‌లో సోడియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులోని సెరోటోనిన్, ట్రఫ్టోఫాన్ హార్మోన్లు హ్యాపీగా నిద్రపోయేలా చేస్తుంది. నిద్రలేమితో బాధపడే వాళ్లకు ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలను నిరోధించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. గర్భిణులకు కూడా పండు చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా మధుమేహం, కాలేయ సమస్యలు వంటివి రాకుండా ఉంచడంలో ఈ పండు బాగా సహాయపడుతుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ పండు మార్కెట్లో లభ్యమవుతుంది. కనీసం వారానికొకసారి అయిన తింటే బోలెడన్నీ ప్రయోజనాలు చేకూరుతాయి. రోజూ వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.