https://oktelugu.com/

Budimpandu : మీరు ఎప్పుడైనా బుడిం పండు తిన్నారా.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ కావాల్సిందే!

రసాయనాలతో పండిస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందని.. లాభాలు వస్తాయని చాలామంది ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. అయితే పండ్లలో చాలామందికి బుడిం పండు గురించి అసలు తెలియదు. చాలా అరుదుగా లభించే ఈ పండు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 24, 2024 / 10:42 PM IST

    Budimpandu

    Follow us on

    Budimpandu : ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది పండ్లు ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ అయితే తప్పకుండా తింటారు. సీజన్ల బట్టి రకరకాల పండ్లు ప్రగతి లభిస్తాయి. సాధారణంగా చాలామందికి యాపిల్, దానిమ్మ, జామకాయ, ఆరెంజ్ వంటి పండ్లు గురించి మాత్రమే ఎక్కువగా తెలిసి ఉంటుంది. మనకి తెలియని చాలా పండ్లు ఉన్నాయి. అయితే కొన్ని రకాలు పండ్లు కేవలం కొన్ని ప్రదేశాల్లో మాత్రమే పండుతాయి. ఆరోగ్యంగా ఉండాలని ఈరోజుల్లో ఎక్కువగా పండ్లు తింటారు. కానీ వీటిని సహజ సిద్ధంగా పండించకుండా.. రసాయనాలతో సాగు చేస్తున్నారు. ఇలా సాగు చేసిన పండ్లను తినడం వల్ల ప్రమాదకర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయిన కూడా సహజ సిద్ధంగా పండించడం లేదు. రసాయనాలతో పండిస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందని.. లాభాలు వస్తాయని చాలామంది ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. అయితే పండ్లలో చాలామందికి బుడిం పండు గురించి అసలు తెలియదు. చాలా అరుదుగా లభించే ఈ పండు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.

    సీజనల్‌గా దొరికే ఈ బుడిం పండు చాలా అరుదుగా దొరుకుతుంది. ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే ఈ పండు లభిస్తుంది. ఈ పండులో బోలెడన్నీ పోషకాలు ఉన్నాయి. తీగ జాతికి చెందిన ఈ పండు ఏడాదిలో కేవలం రెండు నెలలు మాత్రమే లభిస్తుంది. ఆ తర్వాత లభించదు. చూడటానికి పుచ్చకాయ అంతా పరిమాణంలో ఉన్న ఈ పండు ఆకుపచ్చగా ఉంటుంది. పండుగా మారే కొద్దీ పసుపు పచ్చ రంగులోకి మారుతుంది. చాలా సువాసనలను ఈ పండు వెదజల్లుతుంది. తినడానికి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తింటే అసలు వదలరు. కొందరు కేవలం ఈ పండు ముక్కలుగా కట్ చేసుకుని తింటారు. కానీ మరికొందరు అందులో పంచదారను కలుపుకుని తింటారు. బుడిం పండుకు పంచదార పెట్టి తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందట. వీటికి ఎలాంటి మందులు వాడకపోయిన సహజంగానే ఈ బుడిం పండ్లు కాస్తాయి.

    బుడిం పండును ఒక్కరే అలా తినేయవచ్చు. పండు మొత్తం తిన్నా లేదా సగం పండు తిన్నా వెంటనే ఆకలి తీరిపోతుంది. చాలా సమయం వరకు ఆకలి వేయదు. ఇందులో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఎక్కువగా తీపి లేకపోవడం వల్ల మధుమేహం ఉన్నవాళ్లు కూడా తినవచ్చు. ఇందులో తక్కువగా క్యాలరీస్ ఉండి.. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బాడీ డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. ఈ పండులో పీచు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం తగ్గడంతో పాటు జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అరుదుగా దొరికే ఈ పండును ఒక్కసారి అయిన తినండి. సీజన్‌లో మాత్రమే ఈ పండు దొరుకుతుంది. ఏడాదికి ఒక్కసారైన తినడం మానేస్తే ఆరోగ్య ప్రయోజనాలు అన్నింటిని మిస్ చేసకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితులో కూడా ఈ పండును తినడం మిస్ కావద్దు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.