Aloe vera pulp : కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. చాలామంది దీన్ని జ్యూస్ చేసి తాగడం లేదా దీని గుజ్జు తీసుకుంటారు. ఈ కలబందను రోజు తీసుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా చర్మ, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీనిని చర్మానికి, జుట్టుకి అప్లై చేయడం వల్ల మంచిగా ఉంటుంది. అయితే చాలామంది కలబంద గుజ్జును పరగడుపున తింటుంటారు. ఇలా తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు అని అనుకుంటారు. అయితే దీనిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రమే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యానికి మంచిదని వీటిని ఎక్కువగా తినకూడదు. తింటే అనారోగ్య బారిన పడతారు. మరి అధికంగా ఈ కలబంద గుజ్జు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో చూద్దాం.
రోజు ఉదయం పరగడుపున కలబంద గుజ్జు తినడం వల్ల బరువు తగ్గుతారని భావిస్తారు. కానీ ఇది బాడీ డీహైడ్రేషన్ కు కారణం అవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా ఈ కలబంద జ్యూస్ తాగిన శరీరంలో పొటాషియం స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. దీంతో హృదయ స్పందనలో మార్పులు వస్తాయని అంటున్నారు. మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు ఈ కలబంద జ్యూస్ ను ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇది మంచిది కాదని వైద్యులు అంటున్నారు. ఎందుకు అంటే ఈ జ్యూస్ వల్ల కొందరికి కడుపు నొప్పి వస్తుంది. అలాగే అజీర్తి వంటి సమస్యలు కూడా వస్తాయి. కొందరికి రక్త పోటు కూడా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువగా తీసుకోవద్దు. స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్లు ఈ కలబందను అసలు చర్మానికి అప్లై చేయకూడదు. గర్భిణులు ఈ కలబంద రసాన్ని తాగడం వల్ల అబార్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. బాలింతలు కూడా కలబంద జ్యూస్ అసలు తాగకూడదు. ఈ జ్యూస్ పడని వాళ్లకి వీరేచనాలు అవుతాయి. అయితే కలబంద వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోజు కలబందను ముఖానికి రాయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే జుట్టు కూడా బలంగా తయారయ్యి సాఫ్ట్ గా ఉంటుంది. జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్న వాళ్లకి కల బంద బాగా ఉపయోగపడుతుంది. అయితే డాక్టర్ ను సంప్రదించిన తరువాత మాత్రమే తీసుకోవాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.