Eating Sweets: తీపి వస్తువులు అంటే కొందరికి ఇష్టం ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా తీపి తినడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ ఎక్కువగా తీపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని కాస్త ఆలోచిస్తారు. అయితే ఏదైనా పండుగ సమయంలో అయితే చెప్పక్కర్లేదు. గతంలో కంటే ఎక్కువగా ఆ రోజు స్వీట్లు తింటారు. అధికంగా స్వీట్లు తినడం వల్ల ఎక్కువగా షుగర్ వస్తుందనే విషయం తెలిసిందే. అయితే కేవలం ఇవే కాకుండా అజీర్ణం, జీర్ణ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తీపి తినడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యం దెబ్బతింటుంది. కొందరు అయితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వంటి బారిన కూడా పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి అసలు స్వీట్లు తినడం మాత్రం మానరు. స్వీట్లు అధికంగా తినడం వల్ల మీకు కడుపులో అజీర్ణం, నొప్పిలా అనిపిస్తే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. వీటిని పాటిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మరి ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
ఫెన్నెల్ వాటర్
జీర్ణ సమస్యల నుంచి బయట పడాలంటే ఫెన్నెల్ వాటర్ బాగా ఉపయోగపడతాయి. ఈ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఫెన్నెల్ గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచడం ద్వారా జీర్ణక్రియకు సంబంధించిన అన్ని సమస్యలను దూరంగా ఉంచుతుంది. అలాగే ఇది మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా నోటి దుర్వాసనను తొలగించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
పుదీనా టీ
పుదీనా టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో జీర్ణ క్రియను ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. ఒక గ్లాసు నీటిలో 12 నుండి 15 పుదీనా ఆకులు రెండు, మూడు ఎండుమిర్చి వేసి బాగా మరిగించాలి. కాస్త చల్లారగానే వడగట్టి తాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గేలా కూడా చేస్తుంది. అలాగే అలసట, నీరసం వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.
తులసి టీ
సహజ డిటాక్స్‌గా తులసి టీ బాగా ఉపయోగపడుతుంది. తులసి ఆకుల టీ తాగడం వల్ల ప్రేగు కదలికలను మెరుగుపరచడం, జీర్ణవ్యవస్థ సమతుల్యతను ప్రోత్సహించడం, పీహెచ్ స్థాయిలను నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే ప్యాంక్రియాటిక్ కణాల పనితీరుకు మద్దతు ఇస్తుంది. ఇందులోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బాగా సహాయపడతాయి. అయితే ఈ తులసి టీని ఒక గ్లాసు నీటిలో కొన్ని ఆకులు వేసి బాగా మరిగించి తయారు చేసుకోవాలి.
జీలకర్ర నీరు
జీలకర్ర నీటిని డైలీ తాగడం వల్ల అజీర్ణం సమస్య నుంచి విముక్తి చెందుతారు. ఇది జీవక్రియను పెంచడంతో పాటు ఎసిడిటీ సమస్యలను కూడా తగ్గిస్తోంది. జీలకర్ర నీటిలో కొవ్వును తగ్గించే శక్తి ఉంటుంది. దీనివల్ల తొందరగా బరువు కూడా తగ్గుతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.