https://oktelugu.com/

Beauty Tips : ఈ పప్పుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. బ్యూటీ ప్రొడక్ట్స్ తోనే పని ఉండదు

పెసర పప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి.ఈ పప్పుతో ఎలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మెరుస్తు్ందో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By: Srinivas, Updated On : November 8, 2024 11:23 am

Beauty Tips

Follow us on

Beauty Tips :  అందానికి అమ్మాయిలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందరిలో అందంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా మెరవడానికి ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటంతో పాటు చిన్న చిన్న సహజ చిట్కాలు కూడా పాటిస్తుంటారు. అయితే అందంగా కనిపించాలంటే కేవలం ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే వాడితే సరిపోదు. ఆహారంలో కూడా కొన్ని రకాల పదార్థాలు చేర్చుకోవాలి. వీటివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏదో విధంగా డైలీ పోషకాలు ఉండే ఆహారాలను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. అదే ఇంట్లో ఉండే పదార్థాలతో సహజంగా అందాన్ని పెంచుకుంటే ఎలాంటి సైడ్ అఫెక్ట్స్ కూడా ఉండవు. పెసర పప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ పప్పుతో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే అసలు బ్యూటీ ప్రొడక్ట్స్ అవసరం లేకుండానే అందంగా మెరిసిపోవచ్చు. ఇంతకీ ఈ పప్పుతో ఎలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మెరుస్తు్ందో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

ఆరోగ్యానికి మేలు చేసే పెసర పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. ముఖ్యంగా గుండె వ్యాధులు, డయాబెటిస్ వచ్చే సమస్యను కూడా తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. పొడి చర్మంతో బాధపడేవారు పెసర పప్పుతో ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పెసర పప్పును నానబెట్టి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. ఒక 20 నిమిషాల తర్వాత ఆ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే పొడి చర్మం సమస్య తీరుతుంది. ఇలా వారానికి నాలుగు సార్లు చేస్తే పొడిచర్మం సమస్య ఈజీగా తగ్గుతుంది. కొందరి చర్మం ఎక్కువగా ట్యాన్‌కి గురవుతుంటుంది. అలాంటి వారు పెసర పప్పుతో ఈజీగా సమస్యను క్లియర్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌లో పెరుగు కలిపి ముఖం, చేతులు, మెడకు అప్లై చేయాలి. ఆ తర్వాత ఆయిల్‌తో ఈ ప్యాక్‌ను తొలగిస్తే చర్మం మంచిగా మెరుస్తుంది. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. వీటితో కేవలం చర్మం మాత్రమే కాకుండా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జుట్టు సమస్యల నుంచి విముక్తి కలగవచ్చు. ఎక్కువగా జుట్టు రాలడం, పగుళ్లు రావడం జరుగుతుంటే ఈ పెసర పప్పుతో ప్యాక్‌ వేసుకుని జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.