Parasitic Infection : మహానుభావుడు మూవీలో హీరో నీట్‌నెస్‌కి బాండ్ అంబాసిడర్‌లా ఉంటాడు. ఏ వస్తువు ముట్టుకున్న సరే శానిటైజర్ యూజ్ చేయడం లేదా చేతులు శుభ్రం చేసుకోవడం చేస్తుంటాడు. ఇలా ఈ ప్రపంంలో కొంతమంది ఉంటారు. సాధారణంగా టాయిలెట్ వెళ్తే కొందరు మాత్రమే హ్యాండ్ వాష్ చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం అసలు శుభ్రం చేసుకోరు. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ సమయంలో అందరూ చాలా జాగ్రత్తలు పాటించారు. కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసారు. అయితే టాయిలెట్ వెళ్లిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకపోతే ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా అశుభ్రత పాటిస్తే పారాసైటిక్ ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు అంటున్నారు. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఓ వ్యక్తి టాయిలెట్ వెళ్లిన ప్రతిసారి చేతులు కడుక్కోక పోవడం వల్ల అతని ఆరోగ్యం క్షీణించింది. దీంతో డాక్టర్‌ను సంప్రదించగా అతనికి పారాసైటిక్ ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పారు. టాయిలెట్ వెళ్లినప్పుడు చేతులు శుభ్రం చేసుకోకపోతే టేనియా సోలియం అనే పరాన్నజీవి బాడీలోకి ప్రవేశిస్తుంది. అది బాడీలో గుడ్లు పెట్టి చివరకు.. బియ్యం గింజల్లా చిన్న చిన్న పురుగులుగా పేరుకుపోతాయి. ఇవి బాడీలో ఉంటే మెదడులో నరాల సమస్యలు వస్తాయి. అయితే అంత ఈజీగా ఈ ఇన్ఫెక్షన్ కనిపించదు. ఈ పరాన్నజీవి అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. దీనివల్ల ప్రపంచంలో 2.5 మిలియన్ల మంది ప్రజలు ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నారు. అలాగే ఈ పరాన్న జీవి పంది మాంసంలో ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే సరిగ్గా ఉడకని ఆహారంలో కూడా ఈ పరాన్న జీవి ఉంటుంది.
ఈ పరాన్నజీవి ఉన్న వ్యక్తి వాడిన టాయిలెట్‌ను మనం ఉపయోగిస్తే వాటి ద్వారా మనకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. కాబట్టి టాయిలెట్ వెళ్లిన వెంటనే చేతులు, కాళ్లను శుభ్రం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆఫీసులు, కాలేజీలు, పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించే వ్యక్తులు తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే ఈ పరాన్న జీవులు శరీరంలోకి నెమ్మదిగా చేరుతాయి. దీంతో అవి శరీరంలో గుడ్లు పెట్టి టేప్‌వార్మ్‌లుగా మారుతాయి. ఇవి ఎక్కువగా నోటి ద్వారా మాత్రమే చేరుతాయి. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వాళ్లు వాడిన టాయిలెట్, వస్తువులను ఉపయోగిస్తే ఇతరులకు సోకుతుంది. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే తలనొప్పి రావడం, గందరగోళం, మూర్ఛ వంటి నరాల సమస్య ఏర్పడుతుంది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరం. దీనిని నయం చేయడానికి యాంటీ పారాసెటిక్ డ్రగ్స్ ఇస్తారు. మరి దీని తీవ్రత ఎక్కువగా ఉంటే సర్జరీ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడూ పరిశుభ్రత పాటించడం ముఖ్యం.