NIRF Ranking : ఐఐటి మద్రాస్ దేశంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీ గా పేరు పొందింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్ ర్యాంకింగ్స్ తొమ్మిదో ఎడిషన్ వివరాలను సోమవారం వెల్లడించారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేశారు దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలలో ప్రమాణాలను పరిశీలనలోకి తీసుకొని.. కేంద్ర విద్యాశాఖ ఈ ర్యాంకింగ్స్ విడుదల చేస్తుంది. అయితే ఈ ర్యాంకింగ్స్ లో ఐఐటీ మద్రాస్ టాప్ స్థానంలో నిలిచింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రతి ఏడాదిలాగే.. ఈ సంవత్సరం కూడా ర్యాంకింగ్స్ విభాగంలో ఐఐటీలు టాప్ స్థానంలో నిలిచాయి.
ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయంటే..
కాలేజీ విభాగంలో ది హిందూ కళాశాల మొదటి స్థానంలో నిలిచింది. ఐఐఎం అహ్మదాబాద్ మేనేజ్మెంట్ విభాగంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెస్ట్ యూనివర్సిటీ గా, ఐఐటి మద్రాస్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ గా ఎంపికయింది. ఐఐటి మద్రాస్ తర్వాత ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి రూర్కీ, ఐఐటి గౌహతి, ఎన్ఐటి హైదరాబాద్, ఐఐటి తిరుచిరాపల్లి, వారణాసి బిహెచ్ యూ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మేనేజ్మెంట్ విద్యాసంస్థల విభాగంలో..
మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ విభాగంలో టాప్ స్థానంలో అహ్మదాబాద్ ఐఐఎం నిలిచింది. ఆ తర్వాత బెంగళూరు ఐఐఎం, కోజికోడ్ ఐఐఎం, ఢిల్లీ ఐఐటి, కోల్ కతా ఐఐఎం, ముంబై ఐఐఎం, లక్నో ఐఐఎం, ఇండోర్ ఐఐఎం, ఎక్స్ ఎల్ ఆర్ ఐ జంషెడ్పూర్, బాంబే ఐఐటి తర్వాత స్థానాలను ఆక్రమించాయి.
విశ్వవిద్యాలయాల విభాగంలో..
విశ్వవిద్యాలయాల కేటగిరిలో టాప్ స్థానంలో ఐ ఐ ఎస్ సీ బెంగళూరు నిలిచింది. ఆ తర్వాత న్యూఢిల్లీ జేఎన్ యూ, న్యూఢిల్లీ జేఎంఐ, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మణిపాల్, వారణాసి బీహెచ్, ఢిల్లీ యూనివర్సిటీ, కోయంబత్తూరు అమృత విద్యాపీఠం, అలిగడ్ ఏఎంయూ, కోల్ కతా జాదవ్ పూర్ యూనివర్సిటీ, వెల్లూరు విట్ నిలిచాయి.
టాప్ టెన్ విద్యాసంస్థలు ఇవే..
విద్యాసంస్థల్లో.. ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో నిల్చింది. ఆ తర్వాత ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటీ ఖరగ్పూర్, ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఐఐటి రూర్కీ, ఐఐటి గౌహతి, జేఎన్ యూ న్యూఢిల్లీ నిలిచాయి.
టాప్ కళాశాలల విభాగంలో..
టాప్ కళాశాలలో ది హిందూ కాలేజీ ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఢిల్లీలోని మీరిండా హౌస్ కాలేజీ, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్సు కాలేజీ, కోల్ కతా లోని రామకృష్ణ మిషన్ వివేకానంద సెంటినరీ కాలేజ్, ఢిల్లీలోని ఆత్మారాం సనాతన్ ధర్మ కళాశాల, కోల్ కతా లోని సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోయంబత్తూర్ లోని పీఎస్జీఆర్ కృష్ణమ్మాల్ ఉమెన్స్ కాలేజ్, చెన్నై లయోలా కాలేజ్, ఢిల్లీలోని కిరోరి మాల్ కాలేజ్, ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ వుమెన్ నిలిచాయి.
లా కాలేజీల విభాగంలో..
లా విభాగంలో బెంగళూరులోని నేషనల్ లాస్ స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, ఢిల్లీలోని నేషనల్ లాగ్ యూనివర్సిటీ, హైదరాబాదులోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, కోల్ కతా లోని పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురుడికల్ సైన్సెస్, సింబయోసిస్ లా స్కూల్ పూణే నిలిచాయి.
ఆర్కిటెక్చర్ ప్లానింగ్ విభాగంలో..
ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కేటగిరిలో రూర్కి ఐఐటీ, ఖరగ్పూర్ ఐఐటీ, కాలికట్ నిట్, శిబ్ పూర్ లోని ఐఐఈఎస్ టీ, న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యాసంస్థలు నిలిచాయి.