Cough syrup : దగ్గుకు ఈ సిరప్ వాడుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే!

ఈ దగ్గు మందులో ఎలాంటి క్వాలిటీ లేవని అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి క్వాలిటీ లేని సిరప్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అధికారులు తెలిపారు. ఈ సిరప్ ను ప్రజలు వాడవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి నకిలీ మందులు వాడితే 1800-599-6969 నెంబర్‌కు ప్రజలు కాల్ చేయాలని అధికారులు సూచించారు.

Written By: NARESH, Updated On : September 11, 2024 6:40 pm

Cough syrup

Follow us on

Cough syrup : వాతావరణం మారితే చాలు.. దగ్గు, జలుబు వంటివి వచ్చేస్తాయి. ఒక్కసారి దగ్గు వచ్చిందంటే మళ్లీ తగ్గడం చాలా కష్టం. దగ్గు తగ్గాలని కొందరు ఇంట్లోనే చిట్కాలు పాటిస్తారు. మరి కొందరు మందులు వాడుతారు. అయితే ఎక్కువ మంది దగ్గుకి సిరప్ వాడుతారు. సిరప్ వాడటం వల్ల తొందరగా దగ్గు తగ్గుతుందని భావిస్తారు. అయితే సిరప్ లు వాడటం వల్ల దగ్గు తగ్గుతుందో లేదో తెలీదు. కానీ ఇంకా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దగ్గు, జ్వరం వంటివి వస్తే.. చాలా మంది డాక్టర్ ప్రమేయం లేకుండా మెడికల్ షాప్ కి వెళ్లి మందులు తెచ్చుకుంటారు. ఇలా కూడా వాడటం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు. అయితే మార్కెట్ లో చాలా నకిలీ మందులు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆహార పదార్థాలు అన్నిటిలో కూడా కల్తీ అవుతుంది. ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడే మందుల్లో కూడా కల్తీ అవుతుంది. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో నకిలీ దగ్గు మందు తయారుచేస్తున్న వాళ్లను ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేసారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా దగ్గు సిరప్ చేస్తున్న వాళ్లపై అధికారులు సీజ్ చేశారు. కూకట్‌పల్లిలో అఖిల్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ గ్లైకోరిల్ దగ్గు సిరప్ అనే పేరుతో ఈ మందును తయారు చేస్తున్నారు.

ఈ దగ్గు మందులో ఎలాంటి క్వాలిటీ లేవని అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి క్వాలిటీ లేని సిరప్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అధికారులు తెలిపారు. ఈ సిరప్ ను ప్రజలు వాడవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి నకిలీ మందులు వాడితే 1800-599-6969 నెంబర్‌కు ప్రజలు కాల్ చేయాలని అధికారులు సూచించారు. ఇలాంటి నకిలీ మందులు తయారు చేస్తే.. వారిపై తప్పకుండా క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పులు వల్ల చాలా మందికి జలుబు, దగ్గు వంటివి వస్తాయి. ఇలాంటి సమయంలో వెంటనే డాక్టర్ ను సంప్రదించి.. మందులు వేసుకోవాలి. వైద్యులు పర్మిషన్ లేకుండా మెడికల్ షాప్ లో మందులు తీసుకువచ్చి వేసుకోకూడదు. దగ్గు ఎక్కువగా ఉంటే ఇంట్లోనే సహజ చిట్కాలు పాటించాలి. మిరియాలు, అల్లం వంటివి తీసుకోవాలి. అల్లం, శొంఠి, మిరియాలు అన్ని వేసి రసంలా చేసుకుంటే.. దగ్గు తొందరగా తగ్గుతుంది. అలాగే మిరియాల పాలు, అల్లం టీ వంటివి తాగుతుండాలి. అప్పుడే దగ్గు తగ్గుతుంది. చల్లని పదార్థాలు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ వంటి వాటికీ దూరంగా ఉండాలి. ఫ్రిడ్జ్ వాటర్ తాగకుండా.. గోరువెచ్చని నీళ్లు తాగాలి. అప్పుడే దగ్గు తగ్గుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.