https://oktelugu.com/

Relationship : సోషల్ మీడియా వల్ల దాంపత్య బంధం దెబ్బ తింటుందా?

ఏ విషయంలో అయిన మంచి, చెడు రెండు ఉంటాయి. కానీ దానిని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. సోషల్ మీడియాని ఉపయోగించి చాలా మంది లైఫ్ లో సక్సెస్ అయ్యారు. వాటి వల్ల చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అందులో మంచి తెలుసుకుని దాంపత్య బంధాన్ని ఇంకా పెంచుకోవాలి.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 11, 2024 6:53 pm

    Marraige Relationship

    Follow us on

    Relationship :  ఈరోజుల్లో చాలా సగం టైం సోషల్ మీడియా లోనే గడుపుతున్నారు. చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా ఎక్కువగా సోషల్ మీడియాని వినియోగిస్తున్నారు. చదువు అన్ని పక్కన పెట్టి మరి మొబైల్ ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే కొందరు పెళ్లి అయిన తర్వాత కూడా కుటుంబంతో ఎక్కువ సమయం ఉండకుండా సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. దీని వల్ల బందంలో గొడవలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే సోషల్ మీడియా వల్ల దాంపత్య బంధం దెబ్బ తింటుందని భావిస్తున్నారు. మరి ఇందులో నిజమేంతో చూద్దాం.

    ఏ విషయంలో అయిన మంచి, చెడు రెండు ఉంటాయి. కానీ దానిని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. సోషల్ మీడియాని ఉపయోగించి చాలా మంది లైఫ్ లో సక్సెస్ అయ్యారు. వాటి వల్ల చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అందులో మంచి తెలుసుకుని దాంపత్య బంధాన్ని ఇంకా పెంచుకోవాలి. సోషల్ మీడియా ద్వారా సూచనలు తెలుసుకుని అవి పాటించవచ్చు. దీని వల్ల ఇద్దరి మధ్య బంధం బలపడటంతో పాటు అన్యోన్యత కూడా పెరుగుతుంది. సామాజిక మాధ్యమాల వల్ల ఎక్కువగా వ్యతిరేక ప్రభావాలే ఉన్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ కూడా మంచి కంటే చెడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా సమయం గడుపుతూ భాగస్వామికి టైమ్ ఇవ్వడంలేదు. వీటి వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే సోషల్ మీడియా వల్ల కొత్త పరిచయాలు అవుతున్నాయి. వీటి వల్ల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అవుతున్నాయి. ఇది కాస్త విడిపోవడానికి కారణం అవుతున్నాయి. సోషల్ మీడియా వాడటం మంచిదే. కానీ ఎక్కువగా మాత్రం వాడకుండా లిమిట్ గా వాడాలి.

    ఏ వస్తువు అయిన ఎంత వరకు వాడాలో అంత వరకు మాత్రమే వాడాలి. సోషల్ మీడియా వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా వల్ల పిల్లలను, దాంపత్య బంధాన్ని కూడా వదిలేస్తున్నారు. కొందరు డిప్రెషన్ లో ఉంటారు. అలాంటి వాళ్లకి ఎవరైనా ఓదార్పు ఇస్తే.. వాళ్లతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నారు. దీంతో పాత సంబంధాలను వదిలేస్తున్నారు. కొత్త వ్యక్తుల మాయలో పడి లైఫ్ లో అన్ని కోల్పోతున్నారు. ఏది ఎంత వరకు అవసరమో తెలుసుకోవాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. లేకపోతే ఎంత హ్యాపీగా ఉన్న బంధం అయిన ఇబ్బందులు తప్పకుండా వస్తాయి. సోషల్ మీడియా వల్ల నష్టాలే ఎక్కువ ఉన్నాయి అని చెప్పలేం. ఎవరు ఎలా దేనిని వాడతారనే దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి కొంత వరకు మాత్రమే సోషల్ మీడియాను వినియోగించాలి. అధికంగా వినియోగిస్తే ఇబ్బందులు తప్పవు.