https://oktelugu.com/

Work- Home Life : వర్క్, ఇంటి లైఫ్ ను బ్యాలన్స్ చేయలేకపోతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే!

లైఫ్ లో అన్నిటిని కూడా బ్యాలన్స్ చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే ఎలాంటి టెన్షన్లు లేకుండా లైఫ్ చాలా బాగుంటుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే.. వర్క్ లైఫ్ ని, ఇంటి లైఫ్ ని బ్యాలన్స్ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.

Written By:
  • Bhaskar
  • , Updated On : September 11, 2024 / 11:36 PM IST

    Work- Home Life balance

    Follow us on

    Work- Home Life : ఈరోజుల్లో చాలా మంది ఇంట్లో పనులు, వర్క్ లైఫ్ తో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళనతో చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇంట్లో పనులు, కుటుంబ బాధ్యతలు, వర్క్ లైఫ్ ని సరిగ్గా మ్యానేజ్ చేయలేకపోతున్నారు. దీనివల్ల ఏ పని కూడా సరిగ్గా చేయట్లేదు. లైఫ్ లో అన్నిటిని కూడా బ్యాలన్స్ చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే ఎలాంటి టెన్షన్లు లేకుండా లైఫ్ చాలా బాగుంటుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే.. వర్క్ లైఫ్ ని, ఇంటి లైఫ్ ని బ్యాలన్స్ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.

    ఎప్పుడు ఎస్ కాదు.. నో చెప్పడం నేర్చుకోవాలి
    చాలా మంది ఎస్ చెప్పడానికి మొహమాట పడరు. కానీ నో చెప్పడానికి తప్పకుండా మొహమాట పడతారు. వాళ్లు చెప్పిన పని చేయకపోతే ఏమి అనుకుంటారు అని చాలా మంది గొర్రెల తప్ప ఊపుతారు. ఎంత వరకు చేయగలరో అంత వరకు మాత్రమే చేయాలి. ఆఫీస్ లో చెప్పారు కదా అని ఎక్కువగా బాధ్యతలు తీసుకుంటే.. తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు చెప్పిన బాధ్యతలు మాత్రమే చేయండి. అంతకు మించి ఎక్సట్రా పనులు తీసుకోకపోవడం మంచిది.

    టార్గెట్ పెట్టుకోండి
    ఆఫీస్ వర్క్ అయిన, ఇంటి వర్క్ అయిన ఈ సమయానికి పూర్తి కావాలని టార్గెట్ పెట్టుకోండి. అప్పుడే తొందరగా పూర్తి చేస్తారు. అలాగే వర్క్ ఉందని విషయం కూడా గుర్తువస్తుంది. దీంతో ఏ పని ముందు చేయాలి, తరువాత చేయాలని తెలుస్తుంది.

    ఆరోగ్యాంగా కూడా ఉండాలి
    ఎంత బిజీ, టెన్షన్ లో ఉన్న కూడా ఫుడ్ విషయంలో జాగ్రత వహించాలి. ఆరోగ్యమైన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. కొందరు వర్క్ బిజీ లో తినడం మానేస్తారు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యల బారిన పడతారు.

    బ్రేక్ తీసుకోవాలి
    విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా పని చేస్తే అలసట వస్తుంది. ఎంత బిజీ షెడ్యూల్ అయిన అప్పుడప్పుడు పనిలో బ్రేక్ ఇవ్వాలి. అప్పుడే మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. ఒత్తిడిగా ఫీల్ కాకుండా.. పనిని సక్రమంగా చేయగలరు.

    ఇతరులకు వర్క్ ఇవ్వండి
    ఇంట్లో లేదా ఆఫీస్ లో పని ఎక్కువ అయితే ఇతరులకు ఇవ్వండి. పని అంత మీరే చేయకుండా ఇలా షేర్ చేసుకోవడం వల్ల కాస్త భారం తగ్గుతుంది. వాళ్లు కూడా పని చేయగలరు అని నమ్మి ఇతరులకు పని చెప్పండి.

    హద్దులు పెట్టుకోవాలి
    ఏ సమయంలో ఏం చేయాలో అవే చేయండి. ఆఫీస్ టైంలో ఆ వర్క్ మాత్రమే చేయండి. టైం వేస్ట్ చేయకుండా అప్పుడే వర్క్ చేస్తే.. పూర్తి కాలేదు అనే టెన్షన్ ఉండదు. ఆఫీస్ టైంలో బయటకి ఎక్కువగా వెళ్లడం వంటివి చేయకుండా ఉండండి. అప్పుడే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.