Homeవార్త విశ్లేషణHeath Tips : ఎక్కువగా ఈ గింజల వాటర్ తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం ఇరకాటంలో...

Heath Tips : ఎక్కువగా ఈ గింజల వాటర్ తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం ఇరకాటంలో పడినట్లే!

Heath Tips :  ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. సాధారణంగా కొందరి బాడీ వేడిచేస్తుంది. చలవ కోసం కొందరు సబ్జా, చియా సీడ్స్ వాటర్ తాగుతారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అంటుంటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిదే అయిన అధికంగా తినడం వల్ల అనారోగ్య సమస్యలని కోరి తెచ్చుకున్నట్లే అని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఈ పదార్థాన్ని కూడా అధికంగా తీసుకోకూడదు. అధికంగా తీసుకుంటే తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది చియా సీడ్స్ ని అధికంగా తింటున్నారు. ముఖ్యంగా వీటితో రకరకాల పదార్థాలు చేసి తింటున్నారు. చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ మితంగా తీసుకుంటేనే ఆ ప్రయోజనాలు శరీరానికి చేస్తాయి. లేకపోతే అనారోగ్య బారిన పడేలా చేస్తాయి. మరి వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో చూద్దాం.

సాధారణంగా చాలా మంది ఉదయం పూట చియా సీడ్స్ తాగుతుంటారు. అప్పుడప్పుడు తక్కువగా చియా సీడ్స్ తీసుకుంటే పర్లేదు. కానీ డైలీ ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిదే. కానీ ఎక్కువగా తాగడం వల్ల మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అతిసారం కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే రోజుకి కేవలం రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇవే ఆరోగ్యానికి మంచిది. ఇంతకంటే ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య బారిన పడటం తప్పదు. రక్తం పలచబడటం వంటి సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఈ వాటర్ అధికంగా తాగితే రక్తం పలచబడటం, గాయాలు అయితే అధిక రక్తస్రావం జరుగుతుంది. ఈ సమస్యలకు మందులు వాడుతున్న వారు కూడా వీటిని వాడకపోవడం బెటర్. అలెర్జీ ఉన్నవారు ఈ చియా సీడ్స్‌ను తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. అలాగే మధుమేహం ఉన్నవారు కూడా ఈ గింజలను తీసుకోకూడదు. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీనివల్ల సమస్య తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు పూర్తిగా ఈ గింజలను తీసుకోకపోవడం మంచిది. అలాగే జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు అసలు వీటి జోలికి పోకూడదు. ఇందులోని ఫైబర్ జీర్ణ క్రియ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమస్యలు ఉన్నవారు చియా సీడ్స్ జోలికి పోవద్దు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.

 

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular