https://oktelugu.com/

Good Food for Brain : మెదడు చురుగ్గా ఉండాలంటే.. డైట్‌లో ఈ పదార్ధాలు చేర్చుకోవాల్సిందే!

మెదడు అనేది చురుకుగా పనిచేయాలంటే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. శారీరకంగా, మానసికంగా సంతోషంగా ఉంటూ.. సరైన ఆహార పదార్థాలు తీసుకుంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అయితే మెదడు జ్ఞాపకశక్తి పెరిగి చురుకుగా పనిచేయాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో మరి చూద్దాం

Written By:
  • Srinivas
  • , Updated On : September 19, 2024 / 10:44 PM IST

    Good Food for Brain

    Follow us on

    Good Food for Brain : అందరిలో స్మార్ట్‌గా ఉండాలని చాలా మంది భావిస్తారు. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. మెదడు కూడా ఆరోగ్యంగా, చురుకుగా ఉండటం అంతే ముఖ్యం. అయితే మెదడు బాగా పనిచేయాలంటే మన శరీరానికి కావాల్సిన పోషకాహారం ఉండాలి. అప్పుడే ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు. అయితే మెదడు అనేది చురుకుగా పనిచేయాలంటే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. శారీరకంగా, మానసికంగా సంతోషంగా ఉంటూ.. సరైన ఆహార పదార్థాలు తీసుకుంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అయితే మెదడు జ్ఞాపకశక్తి పెరిగి చురుకుగా పనిచేయాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో మరి చూద్దాం.

    నట్స్ ఎక్కువగా తీసుకోవాలి
    ఆరోగ్యానికి నట్స్ చాలా మేలు చేస్తాయి. వీటిని డైలీ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. బాదం, పిస్తా, వాల్‌నట్స్, గింజలు వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల మెదడు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లలను చిప్స్ వంటి మసాలా ఫుడ్స్ అలవాటు చేయకుండా వీటిని అలవాటు చేస్తే వాళ్ల మెదడు పనితీరు మెరుగుపడటంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు.

    వేరుశనగ
    వేరుశనగ గింజల్లో శరీరానికి మంచి చేసే కొలెస్ట్రాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇందులోని అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు వెంటనే తక్షణ శక్తిని ఇస్తాయి. అలాగే మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.

    ఆకుకూరలు
    క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రకోలి, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిది. ఇందులోని పోషకాలు మెదడు సంబంధిత సమస్యను తగ్గించి దాని పనితీరును మెరుగుపర్చడంలో సాయపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది

    బెర్రీస్ పండ్లు తినాలి
    ఆరోగ్యానికి మేలు చేసే బెర్రీస్ పండ్లను తింటే తెలివిగా ఉంటారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ పండ్లు అన్ని వయస్సు గల వారు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. వీటితో పాటు యాపిల్, అవకాడో, విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్లు తిన్న మెదడు చురుకుగా పనిచేస్తుంది.

    సాల్మన్ చేపలు
    సాల్మన్ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే మెదడులోని కణాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

    డార్క్ చాక్లెట్
    కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్‌లు డార్క్ చాక్లెట్‌లో ఎక్కువగా ఉన్నాయి. ఇవి మెదడును చురుకుగా ఉంచడంలో సాయపడతాయి. రోజుకి ఒక ముక్క డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.