thangalaan movie review: కమల్ హాసన్ తరహాలో నటనలో ప్రయోగాలు చేస్తూ ఎవ్వరూ ఊహించని అద్భుతాలను సృష్టించిన నటుడు విక్రమ్. ఈయన అద్భుత నటనకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. అయితే ఒకప్పుడు తమిళనాడు లో కమర్షియల్ సినిమాలకు ట్రేడ్ మార్క్ గా నిలిచి ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న విక్రమ్, ఆ తర్వాత వైవిధ్యాన్ని కోరుకుంటూ, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ, ప్రయోగాత్మక సినిమాలపైనే ఎక్కువగా మక్కువ చూపించాడు. దీంతో ఆయనకీ వరుసగా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. దానివల్ల క్రమంగా ఆయన మార్కెట్ తగ్గుతూ వచ్చింది.
అపరిచితుడు చిత్రం తర్వాత విక్రమ్ కి కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో కూడా అద్భుతమైన మార్కెట్ ఉండేది. రజినీకాంత్ కి ఏమాత్రం తీసిపోయేది కాదు. కానీ ఎప్పుడైతే ఆయనకీ ప్రయోగాల కారణంగా ఫ్లాప్స్ పడ్డాయో, తెలుగులో కూడా అయన క్రేజ్ పడిపోయింది. అయితే ఇప్పుడు ఆయన పీ ఏ రంజిత్ దర్శకత్వం లో ‘తంగలాన్’ అనే చిత్రం చేసాడు. ఈ చిత్రం ఆగస్టు 15 వ తారీఖున తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. టీజర్, ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కూడా విక్రమ్ రెగ్యులర్ గా చేసే ప్రయోగం లాగానే అనిపించినప్పటికీ, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో మార్కెట్ లో బజ్ ఏర్పడింది. ఈ సినిమా దర్శకుడు రంజిత్ కి మొదటి నుండి వెనకబడిన వర్గాలను ఎక్కువగా టార్గెట్ చేసుకొని సినిమాలు చేస్తూ ఉండేవాడు. కబాలి , కాలా, సార్పట్ట పరంపర వంటి చిత్రాలు అలాంటి ఐడియాలజీ మీద వచ్చినవే. తంగలాన్ చిత్రం కూడా అలాంటిదే అని ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి కాపీ ని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది సినీ ప్రముఖులకు స్పెషల్ గా ప్రీమియర్ వేసి చూపించారు. వారి నుండి ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని టాక్. కానీ ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది సందేహమే అని అన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ నటించింది.
ఆమెకి, హీరో కి మధ్య భీకరమైన పోరాట సన్నివేశాలు ఉంటాయట. ఇప్పటి వరకు లేడీ విలన్స్ డామినేషన్ ఉన్న సినిమాలు సక్సెస్ అవ్వడం చాలా తక్కువ చూసాము. కేవలం ‘నరసింహా’ చిత్రం మాత్రమే భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. మిగిలిన సినిమాలన్నీ అనుకున్న స్థాయిని రీచ్ కాలేకపోయాయి. కానీ ఇందులో మాళవిక మోహనన్ ని డైరెక్టర్ చాలా పవర్ ఫుల్ విలన్ గా చూపించాడని తెలుస్తుంది. తన మంత్రశక్తి తో ఊరు మొత్తాన్ని నాశనం చేసే మంత్రగత్తెగా ఈ చిత్రం లో ఆమె కనిపించబోతుందట. చూడాలి మరి ఈ ప్రయోగం బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతుందా లేదా అనేది.