Sleeping Tips: నిద్ర అనేది మనిషికి ఓ వరం.. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా కొందరు నిద్ర పట్టక సతమతమవుతున్నారు. చాలా మంది నిద్ర కోసం ట్యాబ్లెట్లు వాడుతున్నారు. అయితే కొందరు అతిగా నిద్రపోతున్నారు. తీరిక దొరికితే చాలా నిద్రకు ఉపక్రమిస్తున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా నిద్ర పోతున్నారు. నిద్రలేమితో ఎన్ని సమస్యలు ఉన్నాయో.. అతి నిద్రతో అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయంటున్నారు వైద్యులు. అవేంటో తెలుసుకుందాం.
ఎన్ని గంటలు నిద్రపోవాలి..
మనిషికి ఒకపూట ఆహారం లేకపోయినా పర్వాలేదు. కానీ నిద్ర తప్పకుండా ఉండాలి. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండడం ఆరోగ్యకరం. అయితే యుక్త వయసులో చాలా మంది తక్కువ నిద్రపోతున్నారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత యువతకు నిద్ర కరువవుతోంది. తక్కువ నిద్రపోతే వృధ్ధాప్య చాయలు పెరుగుతాయి. బరువు పెరగడం, కొలెస్ట్రాల్, గుండెపోటు, బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలు చుట్టు ముడతాయి.
ఎవరికి ఎంత నిద్ర అవసరం..
అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్రపోవాలి. చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలి. టీనేజీలో ఉండేవారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అతి నిద్ర కూడా అనర్ధమే అంటున్నారు వైద్యులు రోజుకు 7 గంటలకన్నా ఎక్కువగా నిద్ర మంచిది కాదంటున్నారు. 9 గంటల కన్నా ఎక్కువగా నిద్రపోతే శరీరంలో మార్పులు వస్తాయట. 10 గంటలకన్నా ఎక్కువగా నిద్రపోతే ఎప్పుడూ నీరసంగా ఉంటారట. అతిగా నిద్రపోవడం, మద్యం, సిగరెట్ తాగిన దానికన్నా ఎక్కువ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా నిద్రపోయేవారు తలనొప్పి, వెన్ను నొప్పి, స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బుల సమస్య ఎదుర్కొంటారని సూచిస్తున్నారు.
సమస్యలు ఇలా..
ఇక రోజూ మధ్యాహ్నం 30 నిమిషాలు నిద్రపోయేవారితో పోలిస్తే 90 నిమిషాలు నిద్రపోయేవారిలో 25 శాతం గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఎక్కువగా నిద్ర కారణంగా కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయని, ఛాతీ సైజు పెరగడం వంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయని పరిశోధకులు తెలిపారు. మధుమేహం, స్థూలకాయం కూడా ఎక్కువగా వస్తాయని పేర్కొంటున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Are you sleeping too much just like you have this risk
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com