https://oktelugu.com/

Health Tips: నూరేళ్లు బతకాలంటే మీ ఆహారంలో ఇది తగ్గించండి..!!

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక టీ స్పూన్ ఉప్పును తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉప్పు( సోడియం) ను ఎక్కువగా తీసుకోవడం వలన రక్తపోటుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తల్లెత్తుతాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 17, 2024 / 02:25 PM IST

    Health Tips

    Follow us on

    Health Tips: సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉప్పుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉప్పు అనేది కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. అయితే ఎంత మోతాదులో ఉప్పును తీసుకోవాలో తెలియకపోవడం మన హెల్త్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా ఉప్పును కనుక తీసుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో నూరేళ్లు బతకాలంటే ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

    మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక టీ స్పూన్ ఉప్పును తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉప్పు( సోడియం) ను ఎక్కువగా తీసుకోవడం వలన రక్తపోటుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తల్లెత్తుతాయి. అందుకే తీసుకునే ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించాలి. మన శరీరంలో రక్త ప్లాస్మా వాల్యూమ్, యాసిడ్ – బేస్ నిర్వహించడానికి ఉప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం అవసరం. ఇందులో భాగంగా ప్రతి రోజూ 2300 మిల్లీ గ్రాముల సాల్ట్ తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.

    అయితే అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు మాత్రం రోజుకు 1000 నుంచి 1500 మిల్లీగ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలట. అంటే ఒక టీ స్పూన్ లో మూడింట రెండు వంతులు అన్నమాట. ఉప్పులోనే కాకుండా చిప్స్, బిస్కెట్లు మరియు ఊరగాయ వంటి పదార్థాల్లోనూ సోడియం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆహారంలో సోడియాన్ని తగ్గించుకోవాలనుకునే వారు.. ప్యాకేట్ లపై ఉన్న ఆహార్ లేబుల్ ను చదవాలి.. దానిపై ఆహార ప్యాకేజీ 5% DV అని ఉంటేనే తీసుకోవాలి. అది తక్కువ సోడియాన్ని కలిగి ఉందని అర్థం.. అలాగే 20 % DV (Dialy Value) ఉంటే కొనుగోలు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

    ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాలనుకునే వారు ఫుడ్ లో విడిగా ఉప్పును వినియోగించకూడదు. దానికి బదులుగా సుగంధ ద్రవ్యాలు చేర్చుకోవచ్చు… పండ్లు,కూరగాయలు వంటి వాటిని తాజాగా కొనుగోలు చేసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఇంటి ఫుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

    సాధారణ ఉప్పుకంటే.. హిమాలయన్ పింక్ సాల్ట్ ( స్వచ్చమైన ఉప్పు), కోషర్ ఉప్పు, రాతి ఉప్పు, నల్ల ఉప్పు మరియు టేబుల్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా సరైన మొత్తంలో ఉప్పును వాడటం వలన ఆరోగ్యంగా జీవించవచ్చు.