Heart Attack – Gas Trouble: మనదేశంలో గుండెనొప్పులు ఎక్కువే. చిన్న వయసులోనే గుండె జబ్బులతో చాలా మంది మరణిస్తున్నారు. అయినా వారి అలవాట్లు మార్చుకోవడం లేదు. ఫలితంగా నూరేళ్లు పనిచేయాల్సిన అవయవాలు యాభై ఏళ్లకే మూలన పడుతున్నాయి. దీంతో గుండెపోటుతో జీవితాలు చాలిస్తున్నారు. మంచి ఆహారం, వ్యాయామం, యోగా వంటివి చేస్తూ ఉంటే రోగాలు రావని తెలిసినా ఎవరు కూడా లక్ష్య పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఆయుర్దాయం తగ్గించుకుంటున్నారు. చిన్న వయసులోనే గుండెజబ్బులకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. నిండు నూరేళ్లు హాయిగా జీవించాల్సి ఉన్నా మన నిర్లక్ష్యంతో మనమే మన ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నాం.
గుండెజబ్బును కొందరు తేలికగా తీసుకుంటారు. అలా చేస్తే ప్రమాదకరమే. చాతిలో నొప్పి వచ్చినప్పుడు తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. తగిన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటేనే ప్రాణాలు నిలబడతాయి. అంతే కాని ఏదో గ్యాస్ సమస్య అని తేలిగ్గా తీసుకుంటే ప్రాణాలు పోవచ్చు. గుండెపోటును నిర్లక్ష్యం చేస్తే ఉపద్రవమే ఎదుర్కోవాల్సి వస్తోంది. ముందస్తు జాగ్రత్తగా వ్యవహరించి వైద్యుల సూచనల మేరకు నడుచుకోవడం మంచిది. ఇందుకోసం ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం డేంజరే.
అజీర్తి, గ్యాస్ సమస్యల వల్ల కూడా ఒక్కోసారి నొప్పి వస్తుంది. కానీ ఎలాంటి నొప్పి అయినా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకుంటే ఏ ఆపద రాదు. కానీ మనమే సొంత వైద్యం చేయించుకునే క్రమంలో మాత్రలు వేసుకుని తగ్గిపోతుందని అనుకోవడం నిర్లక్ష్యమే అవుతుంది. గుండెపోటు వచ్చినప్పుడు చాతీలో తీవ్రమైన నొప్పి అనిపిస్తుంది. ఏదో బరువు పెట్టినట్లుగా అనిపిస్తుంది. చాతీలో ఏదో తెలియని ఒత్తిడి పడినట్లుగా భారం అవుతుంది. దీంతో వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షించుకుని తగిన వైద్యం చేయించుకోవాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం.
కొన్నిసార్లు జీర్ణసంబంధమైన నొప్పులు కూడా గుండె నొప్పిగానే అనిపిస్తాయి. కడుపులో అజీర్తి కలిగినప్పుడు గ్యాస్ సమస్య వస్తుంది. దీంతో కడుపులో మంట గుండెలో నొప్పిగా అనిపిస్తుంది. ఏ నొప్పి అయినా సరే మనం వైద్యులను సంప్రదించడం మరవొద్దు. వారి ఆధ్వర్యంలో పరీక్షలు చేయించుకుంటే అది గుండె నొప్పా, గ్యాస్ట్రిక్ సమస్య అనేది తెలుస్తుంది. మనం ఎప్పుడైనా సొంత తెలివితేటలు వాడి ప్రాణాలు రిస్క్ లో పెట్టవద్దు. డాక్టర్ల పర్యవేక్షణలోనే వ్యాధి నిర్ధారణ చేసుకుని సంబంధిత మందులు వాడుకుని హాయిగా ఉండేందుకు దారులు వెతుక్కోవాలి.
సమయానికి భోజనం చేయకపోయినట్లయితే కడుపులో పుండ్లు, అల్సర్, అజీర్తి సమస్యలు చుట్టుముడతాయి. దీంతో కూడా కడుపులో నొప్పి వస్తుంది. ఇది కూడా భరించలేనంత బాధగా అనిపిస్తుంది. అందుకే మనం సమయానికి భోజనం చేయాలి. ఎక్కడ ఉన్నా ఎంత పనిలో ఉన్నా తిండి మాత్రం మరిస్తే అంతే. మన ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఫలితంగా మన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుని నూరేళ్లు హాయిగా జీవించాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవాలి.
మనదేశంలోనే గుండె జబ్బుల బారిన ఎక్కువ మంది పడుతున్నారు. చిన్న వయసులోనే టపా కట్టేస్తున్నారు. అయిన వారికి కన్నీరే మిగుల్చుతున్నారు. మితమైన ఆహారం తీసుకోకుండా విచ్చలవిడిగా తింటూ దేహానికి ఇబ్బందులు తెస్తున్నారు. ఫలితంగా జబ్బుల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. నూరేళ్లు బతకాల్సిన శరీరాన్ని సమతుల్యత లేని ఆహారం తీసుకుని రిస్క్ లో పెడుతున్నారు. ఇప్పటికైనా గమనించి మంచి ఆహారం తీసుకుని జబ్బులకు దూరంగా ఉండి జీవితాన్ని ఆస్వాదించాలని నిపుణులు సూచిస్తున్నారు.