Raisins: సాధారణ ఫ్రూట్స్ కంటే డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా ఎనర్జీ ఉంటుందని ఆరోగ్య సూత్రం తెలుపుతుంది. అందువల్ల మార్కెట్లో అందుబాటులో ఉండే డ్రై ఫ్రూట్స్ను తినాలని చెబుతూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా ఎండు ద్రాక్ష(కిస్మిస్) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీనిని నేరుగా తినడంతో పాటు ఇతర ఆహార పదార్థాలలో విరిగా వాడుతూ ఉంటారు. ఎండు ద్రాక్ష గోధుమ రంగుతోపాటు బ్లాక్ కలర్ లో కూడా లభిస్తుంది. ఎండు ద్రాక్ష వల్ల ఎన్నో ఉపయోగకర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఉదయం తీసుకోగానే తక్షణ ఎనర్జీ వస్తుంది. రోజు ఉదయం కొన్ని ఎండు ద్రాక్షలు తినడం వల్ల.. రోజంతా ఎనర్జీగా ఉంటారు. అయితే మార్కెట్లో ఎండు ద్రాక్ష కల్తీ మయం అయినట్లు కొందరు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో నాణ్యమైన ఎండుద్రాక్ష లభించడం ఎలా అని కొందరు సందేహ పడుతున్నారు. ఇలాంటి సమయంలో దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇంట్లో దీనిని ఎలా తయారు చేస్తారు?
ప్రస్తుత కాలంలో కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. మార్కెట్లో ఆహార పదార్థాలు కల్తీమయం కావడంతో చాలామంది సామాజిక మాధ్యమాల్లో తెలుసుకొని వాటిని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా రెండు ద్రాక్షను ఇంట్లో ఎలా తయారు చేయాలంటే?
ఎండు ద్రాక్ష కంటే గ్రీన్ గ్రేప్స్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే మార్కెట్లో దొరికే గ్రీన్ గ్రేప్స్ ను తీసుకొచ్చుకోవాలి. ఇవి రసాయనాలతో కలిగి ఉంటాయి కనుక.. వీటిని ఒక పాత్రలో వేసి అందులో ఉప్పు నీళ్లు పోయాలి. ఇలా చేయడం ద్వారా వాటిపై ఉండే క్రిములు తొలగిపోతాయి. ఆ తర్వాత మరో పాత్రలో వేడి నీరు పోసి అందులో శుభ్రమైన ద్రాక్షను వేయాలి. ఇలా వేసిన కాసేపటికి అవి గోధుమ రంగులోకి మారుతాయి. అలాగే కాస్త ఉబ్బినట్లుగా అవుతాయి. ఇలా కొంచెం పెద్దగా కాగానే వెంటనే ఆ పాత్రను పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత ఆ పాత్రలోని నీరును బయటకు తీసివేసి ఒక పాత్రలో లేదా ఒక చాపలో ఎండు ద్రాక్షలను వేయాలి. ఇలా వేసిన వాటిని కొన్ని రోజులపాటు ఎండలో ఉంచాలి.
కనీసం మూడు రోజుల పాటు ఎండలో ఉన్న తర్వాత వాటిలో ఉన్న నీరు బయటకు పోతుంది. అప్పుడు ఎండు ద్రాక్ష తయారవుతుంది. ఇలా ఎండలో ఉంచిన ఎండు ద్రాక్షను వెంటనే ఒక సీసాలోకి తీసుకొని అందులోకి గాలి చొర పడకుండా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత వాటిని ఉపయోగిస్తూ ఉండాలి. ఎండు ద్రాక్షను తయారు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వీటిని వేడి చేసే సమయంలో ఎక్కువ రేపు స్టవ్ పై ఉంచకుండా ఉండాలి. అలాగే ఎండలో ఉంచిన సమయంలో వాటి నుంచి పూర్తిగా నీరు వెళ్లిన తర్వాతే సీసాలోకి తీసుకోవాలి. ఇక ద్రాక్షలు నాణ్యమైనవి.. పొడుగ్గా ఉండేవి తీసుకోవడం వల్ల రుచికరంగా మారుతాయి. దీంతో ఇంట్లోనే ఇవి తయారు చేసుకోవచ్చు.