Fraud: సెలబ్రిటీల నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు ఇదే తంతు కొనసాగుతోంది. ఆకర్షణ మొదలు కాగానే స్నేహం మొదలు పెడుతున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రేమలో పడుతున్నారు. అనంతరం కలిసి మెలిసి తిరుగుతున్నారు. ఎక్కడో ఒకచోట భేదాభిప్రాయాలు ఏర్పడగానే కటీఫ్ చెప్పుకుంటున్నారు. ఇక అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నవారు.. గోతులు తవ్వుకుంటున్నారు. ఒకరిపై ఒకరు చెడుగా ప్రచారం చేసుకుంటున్నారు.. సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయట పెట్టుకుంటున్నారు.. అప్పటిదాకా కలిసి చేసుకున్న భాసలను బూడిదలో కలిపేస్తున్నారు.. విమర్శలు చేసుకుంటూ.. ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు బజారుపాలు చేసుకుంటున్నారు.. అయితే ఇలాంటి విభేదాలే ఓ ప్రేమ జంట మధ్య ఏర్పడ్డాయి. చివరికి వారు దూరమయ్యారు. అలా ఆ ప్రేమికుల మధ్య ఏర్పడిన విభేదాలు తారా స్థాయికి చేరాయి. చివరికి విడిపోయారు. కానీ ప్రేమ పేరుతో తనను ప్రేయసి మోసం చేయడంతో..ఓ యువకుడు చేసిన పని చర్చకు దారి తీసింది.. ఈ సంఘటన కోల్ కతా లో చోటు చేసుకుంది.
ఇలా బుద్ధి చెప్పాడు..
ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికుల మధ్య గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడాలు సర్వసాధారణం. కలిసిమెలిసి తిరగడం కూడా సర్వసాధారణం. అయితే ప్రేమలో ఉన్నప్పుడు ఓ యువకుడిని అతని ప్రేమికురాలు ఆన్లైన్ షాపింగ్, బహుమతులు కావాలంటూ వేధించింది. ఆమె వేధింపులకు తట్టుకోలేక వీడ్కోలు పలికాడు. అంతేకాదు తనని ఇబ్బంది పెట్టిన ఆ యువతికి ఆమె మాజీ ప్రియుడు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. నాలుగు నెలల వ్యవధిలోనే ఆమెకు 400 క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పంపించాడు. దీంతో ఆన్లైన్ షాపింగ్ సంస్థల డెలివరీ బాయ్ లు రావడంతో ఆమె విసిగిపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. అదంతా కూడా ఆమె మాజీ ప్రియుడి నిర్వాకమని గుర్తించారు.. అంతేకాదు అతడు ఆమెకు తెలియని నెంబర్ నుంచి సందేశాలు పంపి వేధించాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతడిని కోల్ కతా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయమూర్తి ఆ యువకుడికి బెయిల్ మంజూరు చేశారు. ” నేను ఆమె ప్రేమించుకున్నాం. కాకపోతే బహుమతుల కోసం నన్ను ఆమె ఇబ్బంది పెట్టేది. ఆన్లైన్లో విపరీతంగా షాపింగ్ చేసేది. దానివల్ల నేను ఆర్థికంగా నష్టపోయాను. ఆమె వ్యవహార శైలి ఏ మాత్రం మారకపోవడంతో కటీఫ్ చెప్పాను. చివరికి ఆమె తీరు అందరికీ తెలియాలని ఇలా చేశాను. ఇప్పుడు ఆమె అసలు రంగు బయటపడింది.. అంతేకాదు నా రివెంజ్ కూడా తీరిందని” ఆ యువకుడు బెయిల్ లభించిన తర్వాత వ్యాఖ్యానించడం విశేషం.