Worms in Cauliflower: మానవ శరీర ఆరోగ్యం దాదాదాపు కూరగాయల్లోనే ఉంటుంది. పోషకాలు, ప్రొటీన్లు ఉండే వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. దీంతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. వెజిటేబుల్స్ లో కాలీఫ్లవర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో యాంటి బాక్టీరియల్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తుంది. హృదయ సంబంధిత జబ్బులను దరిచేరకుండా కాపాడుతుంది.
అయితే కాలీఫ్లవర్ లో పురుగులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒక కాలిఫ్లవర్ లో అడుగుభాగాన చేరుతాయి. ఇవి తరుచుగా కనిపించడం వల్ల కాలీఫ్లవర్ ను తినడమే మానేస్తున్నారు. కానీ కొన్ని పద్ధతులు ఉపయోగిస్తే ఆ పురుగులు తొలిగిపోతాయి. దీంతో ఎంచక్కా వీటిని తీసుకోవచ్చు. కాలీ ఫ్లవర్ నుంచి ఈజీగా పురుగులు తొలగించే పద్ధతుల గురించి వివరాల్లోకి వెళితే..
కాలీఫ్లవర్ ను మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే చాలా మంది వెంటనే కూర వండేస్తారు. అంటే పెద్ద ముక్కలను కట్ చేసి కూర వండుతారు. కానీ కాలీ ఫ్లవర్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏ మూలన పురుగులు ఉన్నా బయటకు వస్తాయి. అయినా వీటిలో పురుగులు ఉండొచ్చనిపిస్తే కట్ చేసిన ముక్కలను వేడి నీళ్లలో ఉంచాలి. ఇలా వేడి నీళ్లలో ఉంచడం వల్ల పురుగులతో పాటు పరాన్న జీవువుల బయటకు వెళ్తాయి.
వేడినీళ్లతో కడగడం ఎందుకు లే అనుకుంటే పారే నీళ్లల్లో వీటిని కడగవచ్చ. అంటే ప్రెషర్ ఎక్కువగా వచ్చే టాప్ కింద కాలీఫ్లవర్ ను ఉంచడం వల్ల అందులో ఎలాంటి పురుగులు ఉన్నా బయటకు వస్తాయి. వేడి నీళ్లలో కాలీ ఫ్లవర్ ను ఉంచడం వల్ల మెత్తబడిపోతాయి. ఇలా కాకుండా చల్లటీ నీళ్లలోనూ కాసేపు ఉంచాలి. వీటిలో ఉప్పు వేస్తే కాలఫ్లవర్ లో ఎలాంటి కీటకాలు, పురుగు ఉన్నా బయటకు వస్తాయి.
నీళ్లలో ఎక్కువ సేపు ఉంచడం వల్ల కాలీ ఫ్లవర్ మెత్తబడిపోతాయి. దీంతో కొందరు రోస్ట్ చేసుకోవాలనుకునేవారికి ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా కరకరలాడాలంటే నీళ్లలో నుంచి తీసివేసిన తరువాత దీనిని టిష్యూ పేపర్ లో ఉంచాలి. లేదా ఆరబెట్టాలి. ఆ తరువాత అనుకున్న కర్రీని చేసుకోవచ్చు. ఇలా కాలీఫ్లవర్ లో పురుగులు ఉన్నా వాటిని ఈ పద్ధతుల్లో ఉపయోగించడం ద్వారా ఇబ్బందులు ఉండవని అంటున్నారు.