https://oktelugu.com/

Tablets : టాబ్లెట్స్ వేసుకునే ముందు ఎంత నీరు తాగాలి? ఏ జాగ్రత్తలు పాటించాలి?

సమస్య ఏదైనా టాబ్లెట్ కామన్. జలుబు, దగ్గు, జ్వరం, కాళ్ల నొప్పి, కండ్లు కలక, ముక్కు దిబ్బడ, కిడ్నీ ఫెయిల్యూర్, బీపీ, షుగర్ ఇలా ఎన్నో సమస్యలకు ముందుగా ఒకటే మార్గం టాబ్లెట్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 6, 2024 / 02:48 PM IST

    tablets

    Follow us on

    Tablets : సమస్య ఏదైనా టాబ్లెట్ కామన్. జలుబు, దగ్గు, జ్వరం, కాళ్ల నొప్పి, కండ్లు కలక, ముక్కు దిబ్బడ, కిడ్నీ ఫెయిల్యూర్, బీపీ, షుగర్ ఇలా ఎన్నో సమస్యలకు ముందుగా ఒకటే మార్గం టాబ్లెట్. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ ప్రతి ఒక్కటి వేసుకోవాల్సిందే. మరి ఇన్ని టాబ్లెట్స్ వేసుకుంటే ఏ సమస్య లేదా అనుకుంటున్నారా? దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే మీరు టాబ్లెట్స్ వేసుకొనేటప్పుడు వాటర్ తాగుతున్నారా? మరి ఎంత వాటర్ తాగుతున్నారు? ఎంత తాగాలి అనే వివరాలు ఈ ఆర్టికల్ లో చూసేద్దాం.

    ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి మంచినీళ్లు తాగడం కామన్. కానీ కొందరు అసలు నీరు తాగరు.. కొందరేమో గ్లాసులకు గ్లాసులు వాటర్ తాగేస్తుంటారు. ఇందులో ఏది సరైనది. ఇంతకీ ఎంత తాగాలి అంటున్నారు నిపుణులు? ఎంత పరిమాణం మాత్రమే సరైనదో తెలుసుకోండి డియర్స్. మాత్రలు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా నీరు తాగాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే, అప్పుడే మాత్ర నీటితో కలిసి త్వరగా కరిగి శరీరం లోకి వెళ్తుంది. ఇలా చేస్తే మాత్రం దాని ప్రయోజనం పూర్తిగా పొందలేకపోవచ్చట. అయితే మాత్రలు వేసుకున్నప్పుడు ఎంత నీరు తాగాలో తెలియక కొందరు ఇష్టం వచ్చినంత తాగుతుంటారు.

    వేసుకునే మాత్రల పరిమాణాన్ని బట్టి నీటి పరిమాణం మారుస్తూ ఉండాలి అంటున్నారు నిపుణులు. అంటే మాత్రల మోతాదు ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టుగా నీరు తీసుకోవాలి. కనీసం ఒక గ్లాసు మాత్రం పక్కా తీసుకోవాలి. దీని కోసం మీరు వైద్యుల సలహా తీసుకొని పాటించవచ్చు. మాత్రలు వేసుకున్నప్పుడు నీరు తీసుకోకపోతే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అల్సర్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే మాత్రలకు తగ్గట్టుగా నీరు తప్పనిసరిగా తాగడం అలవాటు చేసుకోండి.

    మాత్రలు వేసుకునేటప్పుడు వేడి నీరు తాగితే మరింత మంచిది అంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే మాత్ర త్వరగా కరిగిపోతుంది. కొందరు మాత్రలు వేసుకున్న తర్వాత వెంటనే పడుకుంటారు. కానీ ఇలా చేయవద్దు. వేసుకున్న తర్వాత దాదాపు అరగంట తర్వాత పడుకోవాలి. ఇలా చేస్తేనే మాత్ర శరీరంలోకి వేగంగా చేరుతుంది. అంతేకాదు మాత్రలు వేసుకున్న అరగంట తర్వాత భోజనం చేయడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? మాత్రలను పాలు, జ్యూస్ వంటి వాటితో ఎప్పుడూ వేసుకోవద్దు. లేదంటే మాత్ర కరగడానికి సమయం పడుతుంది.

    ఇలా టాబ్లెట్లు వేసుకునే సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు? ఎంత నీరు తాగాలనే విషయాల మీద కచ్చితంగా అవగాహన ఉండాలి. లేదంటే వైద్యుల సలహా తీసుకోవాలి. వైద్యులు తెలిపిన సమయం ప్రకారమే వేసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవడం వల్ల మీ వ్యాధి కూడా త్వరగా నయం అవుతుంది. మరిన్ని సమస్యలు రావు. ఈ టాబ్లెట్ల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్య రీత్యా టాబ్లెట్లు అందరికి అవసరమే కానీ వాడకంలో మనం కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం.