Homeలైఫ్ స్టైల్How Much Cooking Oil Per Month Per Person: ఆయిల్ ఫుడ్ తింటున్నారా.. ఒక...

How Much Cooking Oil Per Month Per Person: ఆయిల్ ఫుడ్ తింటున్నారా.. ఒక నెలలో మీరు ఎంత నూనె వాడాలంటే..

How Much Cooking Oil Per Month Per Person: నేటి కాలంలో ఇంట్లో తినడం తగ్గిపోయింది. బయట తినడం పెరిగిపోయింది. మనలో చాలామందికి బయట తిండి అంటే చాలా ఇష్టం. అందులోనూ ఆయిల్ ఫుడ్ అంట మరింత ఇష్టం. వడలు, పునుగులు, బోండాలు, పూరీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే మన మెనూ ఒక పట్టాన పూర్తి కాదు. ఆయిల్ ఫుడ్ నాలుకకు రుచికరంగా తగులుతూ ఉంటుంది. అందువల్లే చాలామంది తినడానికి ఇష్టాన్ని చూపిస్తుంటారు.

వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వంట నూనె వాడకంపై పూర్తిగా నియంత్రణ ఉండాలట. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా హాఫ్ లీటర్ రూల్ విధానాన్ని పాటించాలట. ఒక వ్యక్తి ఒక నెలకు గరిష్టంగా ఆర లీటర్ నూనె మాత్రమే వాడాలట. ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే రెండు నుంచి రెండున్నర లీటర్ల కంటే ఎక్కువ నూనెను వినియోగించకూడదట. అధిక నూనె వల్ల ఒబెసిటీ.. కొలెస్ట్రాల్.. గుండె జబ్బుల వంటివి వస్తాయట.. నూనె వాడకం పెరిగిపోవడం వల్ల దేహంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడుతుందట. ఇది రక్తనాళాలలో పేరుకుపోయి.. రక్త సరఫరాకు అడ్డంకిగా మారుతుందట. దీనివల్ల గుండె జబ్బులు.. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయట.

ఇటీవల కాలంలో గుండె జబ్బుల మప్పు పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా గుండె వ్యాధులు వస్తున్నాయి. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చాలామంది చనిపోతున్నారు. యువకులనుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు ఇటీవల కాలంలో ఇదే పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి ముప్పు రాకుండా ఉండడానికి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వంట నూనె వాడకం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు పొద్దుతిరుగుడు గింజలు.. నువ్వులు.. వంటి వాటిని సేకరించి సాంప్రదాయ గానుగలో నూనె పట్టించుకోవాలని చెబుతున్నారు. ఇందులో ఎటువంటి రసాయనాలు ఉండవని.. పైగా పొద్దుతిరుగుడు.. నువ్వుల నూనెలో కొవ్వుల శాతం తక్కువగా ఉంటుందని.. అందువలన శరీరానికి హాని కలగదని వైద్యులు చెబుతున్నారు.

ఒకవేళ పల్లి నూనె కనుక వాడితే.. ఒక పరిమితమైన పద్ధతి పాటించాలని వైద్యులు చెబుతున్నారు. పల్లి నూనెలో కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ నూనె వాడినప్పుడు శరీరంలో కొవ్వులు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అది కాస్త రకరకాల వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది. అందువల్ల పల్లి నూనె వాడకంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. నూనె వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని.. ఇప్పుడే శరీరంలో కొవ్వులు పేరుకుపోకుండా ఉంటాయని వైద్యులు అంటున్నారు. ఒకవేళ నూనె పదార్థాలు తీసుకోవడం అనివార్యంగా మారితే.. కచ్చితంగా శారీరక వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

గమనిక

ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే వివిధ వేదికల వద్ద సేకరించిన సమాచారాన్ని అందించాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కథనాన్ని వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయంగా చూడవద్దని పాఠకులకు సవినయంగా విన్నవిస్తున్నాం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular