Egg health benefits and risks: మనం రోజు తినే ఆహారంలో అన్ని రకాల పదార్థాల్లో ప్రోటీన్లు ఉండకపోవచ్చు. దీంతో కొన్నిసార్లు ప్రత్యేకంగా ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటితోనే శరీరానికి అదనపు శక్తి వస్తుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో కోడి గుడ్డు ఒకటి. కోడిగుడ్డులో 18 రకాల రొటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు శరీరానికి కండరాల నిర్మాణం, ఆర్మూర్ల తయారీ, రోగ నిరోధక శక్తి బలవపదం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. అందువల్ల ప్రతిరోజు లేదా వారానికి కొన్నిసార్లు కోడిగుడ్లు తీసుకోవాలని కొందరు చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల చాలామందికి వస్తున్న సందేహం ఏందంటే.. ప్రతిరోజు ఎన్ని కోడిగుడ్లు తీసుకోవాలి? ఎవరు కోడిగుడ్లు తీసుకోకూడదు? మరి ఆ వివరాలు కి వెళ్తే..
ప్రతిరోజు కోడిగుడ్డును రకరకాల పద్ధతుల్లో తీసుకోవచ్చు. ఉదయం అల్పాహారంగా ఒక కోడిగుడ్డును తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఉదయం వీలు కాకపోతే మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు ఉండే విధంగా చూసుకోవాలి. లేదా సాయంత్రం స్నాక్స్ లో కూడా గుడ్డు తినవచ్చు. కోడిగుడ్డులో 54% ovalbumin, 12 శాతం ovotransfermin, 11% ovomucoid, 3.5 శాతం ovomucin ఉంటాయి. అలాగే ఇందులో లైసో జెమ్ వంటి పదార్థాలు ఉండడంవల్ల శరీరానికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. మిగతా పదార్థాలు కంటే కోడిగుడ్డులో 60 శాతం ప్రధానంగా ప్రోటీన్లు ఉంటాయి. అలాగే ఇందులో కొవ్వులు కూడా ఎక్కువగా ఉండటంతో ఇవి శరీరానికి అదనపు శక్తిని అందిస్తాయి.
అయితే ప్రతిరోజు ఎన్ని కోడిగుడ్లు తినాలి? అని చాలామందికి సందేహం ఉంటుంది. సాధారణ వ్యక్తులు ప్రతిరోజు ఒకటి లేదా రెండు కోడిగుడ్లను తినవచ్చు. వీరు రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చును. అయితే వ్యాయామం చేసేవారు, ఇతర అథ్లెటిక్స్ పోటీలో పాల్గొనేవారు రెండు నుంచి నాలుగు కోడిగుడ్లు తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు అందుతాయి. చిన్నపిల్లలకు ప్రతిరోజు గుడ్డు అందించడం వల్ల వారిలో కాల్షియం అధికంగా చేపడుతుంది. అయితే వీరికి ఒకటి మాత్రమే సరిపోతుంది. కోడిగుడ్డు తినేటప్పుడు బాగా ఉడికించినవే తినాలి. గుడ్డును ఉడికించేటప్పుడు అవి పగిలిపోతే వాటిని దూరం ఉంచాలి.
కోడిగుడ్డును ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీసుకోకపోవడం మంచిది. గుండె జబ్బులు ఉన్నవారు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. అయితే వైద్యుల సలహా మేరకు మిగతా వారి కంటే తక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. చాలామంది కోడిగుడ్డు లో ప్రోటీన్లు ఉంటాయని ఆమ్లెట్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా ఉడికించిన కోడి గుడ్డును మాత్రమే తీసుకోవాలి. ఇందులోనే కావాల్సిన పదార్థాలు ఉంటాయి. అలాగే ఉడికించిన గుడ్డును నేరుగా తీసుకోవడానికి ఇబ్బంది కలిగినప్పుడు ఇందులో మరికొన్ని పదార్థాలను కలుపుకొని తీసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్డు ఉండడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు.