Raghavendra Rao: దర్శక ధీరుడు గా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న రాజమౌళి..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ దర్శకుడిగా గుర్తింపు పొందుతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఆయనతో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా అసక్తి చూపిస్తున్నాడు అంటే ఆయన స్టార్ డమ్ ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక అదే కాకుండా ఆయన సినిమా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే కెరియర్ మొదట్లో ఆయన రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పుడు రాఘవేంద్ర రావు అంటే అందరూ భయపడేవారట. రాజమౌళి కి కూడా ఆయనంటే చాలా భయం ఉండేదట. ఇక రాఘవేంద్ర రావు గారి కార్ లో ఆయన కోసం సపరేట్ గా ముందు సీటు నీట్ గా అరెంజ్ చేసి పెట్టుకునే వాడట. ఆ చైర్ లో ఒక వైట్ టవల్ కూడా పరిచి ఉండేదట. దాని ముందు పండ్లు కూడా ఉండేవట. ఇక దాన్ని ఎవరు ముట్టుకున్నా కూడా మరక ఏర్పడేంత తెల్లగా ఉండేదట.
ఇక ఈ క్రమంలో ఒకరోజు రాఘవేంద్రరావు రాజమౌళితో బయటికి వెళ్దాం రా రాజమౌళి అని చెప్పి, స్వయంగా ఆయనే కారు తీసాడంట. ఇక ఇప్పుడు రాజమౌళి ఎక్కడ కూర్చోవాలో అర్థం కాలేదట. డ్రైవర్ పక్కన సీటు రాఘవేంద్రరావు గారిది కానీ ప్రస్తుతం ఆయన డ్రైవర్ సీట్ లో ఉన్నాడు. కాబట్టి రాఘవేంద్ర రావు గారి స్పెషల్ సీట్లో మనం కూర్చోవడం కరెక్ట్ కాదు. అలాగే గురువు గారు డ్రైవ్ చేస్తున్న సమయంలో వెనకాల సీట్లో కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. అనుకొని ముందు సీట్లోనే కూర్చొని కూర్చోనట్టుగా సీట్ ఎడ్జ్ లో అలా కూర్చున్నాడంట. ఇక అప్పుడు రాజమౌళికి అసలైన నరకం అంటే ఏంటో కనిపించిందట…
రాఘవేంద్రరావు గారు ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు అర్థం కాలేదట. అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ కూర్చున్నాడట…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఈ సినిమాతో ఆయన మరోసారి తన సత్తా ఏంటో పాన్ వరల్డ్ లెవెల్ లో చూపించబోతున్నాడు…