Poha Vs Rice: ప్రస్తుత కాలంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న సమస్య. బరువును తగ్గించుకోవడానికి స్పెషల్ డైట్ ను ఫాలో అవుతున్నారు. అంతేకాదు వాకింగ్ , జాగింగ్, ఎక్సర్సైజ్ వంటివి చేస్తున్నారు. ఇక వీటితోపాటు మంచి ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. చాలా మంది రాత్రిపూట అన్నాన్ని స్కిప్ చేస్తున్నారు కూడా. ఎందుకంటే అన్నం బరువును పెంచుతుంది అనుకుంటారు. దీనికి బదులు చపాతీలు తింటారు. లేదంటే పోహాను తింటుంటారు. నిజానికి పోహా, బియ్యం రెండు ప్రధానమైనవే. అయితే వీటి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం భిన్నంగా ఉంటాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి బరువు తగ్గాలనుకునేవారికి అన్నం తినడం మంచిదా? అటుకులు తినడం మంచిదా? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
పోహాలోని పోషకాలు : అటుకులను ఫ్లాట్ రైస్ అని కూడా పిలుస్తారు. కొందరు పోహా అంటారు. దీన్ని చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో తింటుంటారు. అయితే ఈ అటుకుల్లో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి. ఈ పోహాలో కేలరీలు, కొవ్వులు తక్కువ మొత్తంలో ఉంటాయి. దీని వల్ల మీరు బరువు పెరగరు. అంతేకాదు అధిక బరువును తగ్గించుకోవడానికి బాగా సహాయపడుతుంది ఈ పోహా. . దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తింటే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. అటుకుల్లో ఇనుము కూడా ఉంటుంది.
ఇది శరీరంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయ పడుతుంది.అంతేకాదు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయం చేస్తుంది. పోహాలో విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు మెండే. అటుకులు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. తద్వారా అంటువ్యాధులు, ఇతర రోగాలకు దూరంగా ఉండవచ్చు. వీటిలో గ్లూటెన్ ఉండదు. ఉదరకుహర వ్యాధి ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి అటుకులు.
అన్నంలోని పోషకాలు : భారతదేశంలో చాలా మంది అన్నాన్నే ఎక్కువ తింటారు. బియ్యం కార్బోహైడ్రేట్లకు మంచి వనరుగా చెబుతారు. ఇది మన శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో సహాయం చేస్తుంది. కానీ అటుకులతో పోలిస్తే బియ్యంలోనే కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు నిపుణులు. అందుకే మీరు బరువును తగ్గాలి అనుకుంటే అటుకులు ఎంచుకోవడం బెటర్.
పోహా వర్సెస్ రైస్: ఏది ఆరోగ్యకరమైనదో కూడా తెలుసుకోండి: ఆరోగ్య ప్రయోజనాల పరంగా చూసుకున్నట్టైతే పోహా, అన్నం రెండు కూడా శరీరానికి చాలా మంచివి అంటున్నారు నిపుణులు. అటుకులు బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్స్ గా తీసుకోవడానికి బాగుంటాయి. ఇక ఇవి ఎలాంటి సమయంలో అయినా సరే సులభంగా జీర్ణం అవుతాయి. అలాగే దీనిలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువ. సో బరువు పెరగరు. తగ్గాలి అనుకున్న వారికి కూడా బెస్ట్ ఎంపిక.
ఇక అన్నంలో బ్రౌన్ రైస్, తృణధాన్యాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో అన్నం ముందుంటుంది. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది అన్నం. భోజనంలో అన్నం తినాలా? లేకపోతే అటుకులు తినాలా? అనేది మీ వైద్యుల సలహాను తీసుకోవడం బెటర్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.