కరోనా వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పవర్ ఎంతకాలం ఉంటుందంటే..?

భారతదేశంలోని ప్రజలకు ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తొలిదశలో మూడు కోట్ల మందికి కరోనా వ్యాకిన్ పంపిణీ జరగనుందని తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉండటం గమనార్హం. సాధారణంగా కొన్ని వ్యాక్సిన్లు దీర్ఘకాలం ప్రభావం చూపిస్తాయి. Also Read: పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా..? సోకదా..? ఒకసారి వ్యాక్సిన్ ను […]

Written By: Navya, Updated On : January 12, 2021 4:18 pm
Follow us on

భారతదేశంలోని ప్రజలకు ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తొలిదశలో మూడు కోట్ల మందికి కరోనా వ్యాకిన్ పంపిణీ జరగనుందని తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉండటం గమనార్హం. సాధారణంగా కొన్ని వ్యాక్సిన్లు దీర్ఘకాలం ప్రభావం చూపిస్తాయి.

Also Read: పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా..? సోకదా..?

ఒకసారి వ్యాక్సిన్ ను తీసుకుంటే మళ్లీ జీవితంలో ఆ వ్యాధి కోసం వ్యాక్సిన్ ను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే కరోనా వ్యాక్సిన్ ప్రభావం మాత్రం శరీరంపై దీర్ఘకాలం ఉండదని తక్కువ సమయం మాత్రమే వ్యాక్సిన్ ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. ఒకటికి మించి కరోనా వ్యాక్సిన్లు సక్సెస్ కావడంతో ఈ ఏడాది భారీగా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది.

Also Read: స్మోకింగ్ చేసేవాళ్లకు అలర్ట్.. కరోనా ప్రభావం ఎక్కువంటున్న శాస్త్రవేత్తలు..!

కరోనా వ్యాక్సిన్లు ఏడాది నుంచి రెండేళ్ల వరకు ప్రభావం చూపుతాయని వైరస్ విజృంభణ ఇదే విధంగా ఉంటే రెండేళ్ల తర్వాత మళ్లీ కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్లు ఎంతకాలం ప్రభావం చూపుతాయో కచ్చితంగా చెప్పలేమని.. వ్యాక్సిన్ల పనితీరుకు సంబంధించి మరికొన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు మాత్రం కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న తరువాత కనీసం ఎనిమిది నెలల పాటు శరీరంపై ఉంటుందని తేలింది. కొన్నిసార్లు మాత్రం వ్యాక్సిన్ జీవితకాలం ప్రభావం చూపుతాయని కరోనా వ్యాక్సిన్లు జీవితకాలం ప్రభావం చూపుతాయో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందేనని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.