కేసీఆర్ ను భయపెట్టే నిజం చెప్పిన బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరో బాంబు పేల్చారు. మంత్రి పదవులు రాకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది అసంతృప్తితో ఉన్నారని.. వచ్చే ఎన్నికల నాటికి గంపగుత్తగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి దూకుతారని వ్యాఖ్యానించారు. బండి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. Also Read: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఫోన్ చేస్తే బస్ పాస్..? హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు […]

Written By: NARESH, Updated On : January 10, 2021 7:40 pm
Follow us on

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరో బాంబు పేల్చారు. మంత్రి పదవులు రాకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది అసంతృప్తితో ఉన్నారని.. వచ్చే ఎన్నికల నాటికి గంపగుత్తగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి దూకుతారని వ్యాఖ్యానించారు. బండి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Also Read: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఫోన్ చేస్తే బస్ పాస్..?

హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ దోపిడీని బండి సంజయ్ ఎండగట్టారు. ఈ క్రమంలోనే కరీంనగర్-వరంగల్ రహదారికి కేంద్రం నిధులు ఇచ్చిందని.. టెండర్లు పిలవకుండానే పనులు ప్రారంభించారని దీనివెనుక పెద్ద దోపిడీ ఉందని ఆరోపించారు.

టీఆర్ఎస్ నేతలకు కాంట్రాక్టులు ఇచ్చి కరీంనగర్ రహదారిపై సీఎం పేరు చెప్పి కాంట్రాక్టులు, అధికారులు దోచుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

Also Read: కేటీఆర్‌‌లో ఈ మార్పుకు కారణమేంటో..?

ఈ సందర్భంగా సీఎంవో ప్రజల కోసం పనిచేస్తుందా? కమీషనర్ల కోసం పనిచేస్తోందా? అని బండి నిలదీశారు. బాధ్యతగా ఉండాల్సిన యంత్రాంగం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, కార్పొరేషన్ ఎన్నికల్లో మొన్నటి ఫలితాలే పునరావృతం కాబోతున్నాయని పేర్కొన్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

మొత్తానికి బండి సంజయ్ ప్రతి విషయంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతూనే ఉన్నాడు. ప్రతిదాంట్లోనూ అవినీతిని ఎండగడుతూ ఇరుకునపెడుతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్