పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. డబ్బులు రాకపోతే ఏం చేయాలంటే..?

దేశంలో ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్న కోట్ల సంఖ్యలో ఉద్యోగులకు గత నెల 31వ తేదీన వడ్డీ జమైన సంగతి తెలిసిందే. 8.5 శాతం వడ్డీని ఈ.పీ.ఎఫ్.వో గత నెలలో జమ చేసింది. చాలామంది ఉద్యోగులకు పీఎఫ్ వడ్డీ జమైనప్పటికీ కొందరి ఖాతాల్లో మాత్రం వడ్డీ జమ కాలేదు. వడ్డీ జమ కాకాపోవడంతో చాలామంది పీఎఫ్ ఖాతాదారులు కంగారు పడుతున్నారు. మీ అకౌంట్ లో పీఎఫ్ వడ్డీ జమ కాకపోతే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా సులభంగా […]

Written By: Kusuma Aggunna, Updated On : January 12, 2021 4:00 pm
Follow us on

దేశంలో ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్న కోట్ల సంఖ్యలో ఉద్యోగులకు గత నెల 31వ తేదీన వడ్డీ జమైన సంగతి తెలిసిందే. 8.5 శాతం వడ్డీని ఈ.పీ.ఎఫ్.వో గత నెలలో జమ చేసింది. చాలామంది ఉద్యోగులకు పీఎఫ్ వడ్డీ జమైనప్పటికీ కొందరి ఖాతాల్లో మాత్రం వడ్డీ జమ కాలేదు. వడ్డీ జమ కాకాపోవడంతో చాలామంది పీఎఫ్ ఖాతాదారులు కంగారు పడుతున్నారు. మీ అకౌంట్ లో పీఎఫ్ వడ్డీ జమ కాకపోతే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా సులభంగా వడ్డీని పొందవచ్చు.

Also Read: ఆ తేనెటీగల పెంపకంతో లక్షల్లో ఆదాయం.. ఎలా అంటే..?

యూఏఎన్ నంబర్ ను కలిగి ఉన్న పీఎఫ్ ఖాతాదారులు https://epfigms.gov.in/ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయడం ద్వారా సులభంగా వడ్డీ జమవుతుంది. వెబ్ సైట్ లో రిజిస్టర్ గ్రీవెన్స్ అనే ఆప్షన్ ను మొదట ఎంచుకుని ఆ తరువాత పీఎఫ్ మెంబర్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తరువాత యూఏఎన్ నంబర్ ను, క్యాప్చాను ఎంటర్ చేసి పీఎఫ్ అకౌంట్ కు రిజిష్టర్ చేసుకున్న వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.

Also Read: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఫోన్ చేస్తే బస్ పాస్..?

వన్ టైమ్ పాస్ వర్డ్ ను కరెక్ట్ గా ఎంటర్ చేసిన తరువాత పీఎఫ్ అకౌంట్ ను ఎంపిక చేసుకుని పీఎఫ్ నగదు జమ కాకపోవడానికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు పీఎఫ్ అమౌంట్ జమ కావాలంటే అవసరమైన సర్టిఫికెట్లను జత చేసే అవకాశం ఉంటుంది. ఆ తరువాత పీఎఫ్ అకౌంట్ రిజిష్టర్డ్ నంబర్ కు ఫిర్యాదు నంబర్ వస్తుంది. సమస్య పరిష్కారమైన తరువాత వడ్డీ ఖాతాలో జమవుతుంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

2019 – 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈ.పీ.ఎఫ్.వో గత నెల 31న జమ చేసింది. మొదట రెండు విడతల్లో వడ్డీ జమవుతుందని వార్తలు రాగా ఆ తరువాత ఈ.పీ.ఎఫ్.వో ఒకే విడతలో వడ్డీని జమ చేసింది.